హ‌ల్దీ వేడుక‌లో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన కాజ‌ల్‌.. బిత్త‌ర‌పోయిన గౌత‌మ్

ల‌క్ష్మీ క‌ళ్యాణం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. 2007లో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యమైన కాజ‌ల్ .. చంద‌మామ సినిమాతో తొలి హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం త‌ర్వాత కాజల్ వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో న‌టించి నేష‌న‌ల్ వైడ్‌గా పేరు ప్ర‌ఖ్యాతలు పొందింది. 35 ఏళ్ళ వ‌య‌స్సు ఉన్న కాజ‌ల్ ఈ రోజు సాయంత్రం ముంబైలో త‌న ప్రియుడు గౌచమ్ కిచ్లుని వివాహం చేసుకోనుంది. కాజ‌ల్, గౌత‌మ్ పెళ్లికి సంబంధించిన పెళ్ళి ఏర్పాట్ల‌న్నింటిని నిషా అగ‌ర్వాల్ చూసుకుంటుంది.

కాజ‌ల్ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేషన్‌లో భాగంగా మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుక‌ల‌కి సంబంధించిన ఫోటోలు గ‌త రాత్రి నుండి సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చేస్తున్నాయి. తాజాగా హ‌ల్దీ వేడుక‌లో కాజ‌ల్ డ్యాన్స్ చేసిన వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప‌సుపు రంగు దుస్తులు ధరించిన కాజ‌ల్ కూలింగ్ గ్లాసెస్ పెట్టి త‌న సోద‌రి నిషా అగ‌ర్వాల్‌తో పాటు పలు‌వురు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చిందులేసింది. ప్ర‌స్తుతం కాజ‌ల్ డ్యాన్స్ వీడియోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

మ‌రో వీడియోలో బంగారు రంగు దుస్తులు ధ‌రించిన నిషా అగ‌ర్వాల్ ఒక‌వైను డ్యాన్స్ చేస్తూనే అతిథుల‌ని ఆహ్వానిస్తూ బిజీబిజీగా మారింది. త‌న కుమారుడు ఇషాన్ వ‌లేచాని ఎత్తుకొని మ‌రీ డ్యాన్స్ చేస్తున్న‌ నిషా.. గౌత‌మ్ కిచ్లు ఫ్యామిలీని కూడా డ్యాన్స్ చేసేందుకు ఆహ్వానించింది.వేడుక‌లో కాజ‌ల్ ఫ్యామిలీ చేస్తున్న ర‌చ్చ చూసి గౌత‌మ్ బిత్త‌ర‌పోయిన‌ట్టు వీడియోలో క‌నిపిస్తుంది. మెహందీ, హ‌ల్దీ ఫోటోలే ఇంత‌లా ర‌చ్చ చేస్తుంటే ఇక కాజ‌ల్ పెళ్ళి ఫోటోలు సునామి సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కాజ‌ల్ కెరీర్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం మోస‌గాళ్ళు చిత్రంతో పాటు క‌మ‌ల్ హాస‌న్ భారతీయుడు 2, చిరంజీవి ఆచార్య చిత్రాలు చేస్తుంది. ఈ అమ్మ‌డి పెళ్లికి ఇండ‌స్ట్రీ నుండి కేవ‌లం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్ర‌మే హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది.