ఇట్స్ అఫిషియల్ : కాజల్ పెళ్లయిపోయింది.. ఫోటోలు వైరల్

kajal aggarwal married to gautam kitchlu in mumbai

కాజల్ అగర్వాల్ పెళ్లయిపోయింది. అక్టోబర్ 30న తాను పెళ్ల చేసుకోబోతున్నట్టు కాజల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ముంబైలో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య కాజల్ పెళ్లి గౌతమ్ కిచ్లుతో జరిగింది.

kajal aggarwal married to gautam kitchlu in mumbai
kajal aggarwal married to gautam kitchlu in mumbai

తన ప్రేమ, పెళ్లి.. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా.. కోవిడ్ టైమ్ లోనే పెళ్లి చేసేసుకుంది పంచదార బొమ్మ. ఇక తన పెళ్లి అయిపోయినట్టుగా గౌతమ్ తో కలిసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

kajal aggarwal married to gautam kitchlu in mumbai
kajal aggarwal married to gautam kitchlu in mumbai

మూడు పదుల వయసులో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కాజల్ కుర్ర హీరోయిన్లకు ఇంకా గట్టి పోటీనిస్తోంది. తన అందాన్న ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ.. ఇంకా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఈనేపథ్యంలో తన పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చినా వాటన్నింటినీ పట్టించుకోని కాజల్.. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసేసుకుంది.

పెళ్లి కంటే ముందు జరిగిన డ్యాన్స్ వేడుకలో కాజల్, తన కుటుంబ సభ్యులు ఎంతో హుషారుగా పాల్గొన్నారు. కాజల్ అగర్వాల్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగులో ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది.