కొడుకుతో కలిసి మొదటసారి హాలిడే వెకేషన్ వెళ్ళిన కాజల్.. ఫోటో వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారగా ఓ వెలుగు వెలిగిన నటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాజల్ అగర్వాల్ గత రెండు సంవత్సరాలు తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు. ఇక పోతే పెళ్లయిన తర్వాత కాజల్ అగర్వాల్ తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే ఈమె గత ఏడాది ప్రెగ్నెంట్ కావడంతో తాను కమిట్ అయిన సినిమాల నుంచి తప్పుకున్నారు. ఇకపోతే ఈ ఏడాది మొదట్లో కాజల్ అగర్వాల్ గర్భవతి అనే విషయాన్ని తన భర్త క్లారిటీ ఇచ్చారు. అప్పటినుంచి కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ ఫోటో షూట్ లో అభిమానులను సందడి చేశారు.

ఇకపోతే ఈమె ఏప్రిల్ 19వ తేదీ తన కుమారుడికి జన్మనిచ్చారు.బాబుకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ తల్లిగా పూర్తిగా తన కొడుకు బాధ్యతలను చూసుకుంటూ గత కొన్ని నెలల నుంచి ముంబైకి పరిమితం అయ్యారు. కొన్ని నెలల నుంచి ముంబైలో ఉంటున్న కాజల్ తర్వాత మొదటిసారిగా తన కొడుకుతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లారు. తన భర్త తన చెల్లెలు నిషా అగర్వాల్ కుటుంబంతో కలిసి కాజల్ అగర్వాల్ గోవా వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే గోవా వెకేషన్ లో భాగంగా వీరందరూ కలిసి ఎంతో ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే గోవా వెకేషన్ లో భాగంగా కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కాజల్ అగర్వాల్ తన కుమారుడు నీల్ మొదటిసారిగా బీచ్ లో అడుగు పెట్టినట్టు తన కాలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నీల్ ఫస్ట్ హాలిడే వెకేషన్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే డెలివరీ తర్వాత కాజల్ ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.