కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత జోరు పెంచింది. ఇటు సినిమాలు, అటు వ్యాపారాలతో బిజీగా ఉంటోంది. కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లూ వ్యాపారానికి తోడుగా ఉంటుంది. ఇద్దరూ కలిసి కొత్త బ్రాండ్‌ను కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టేశారు. మొత్తంగా అలా కాజల్ పెళ్లి తరువాత వ్యాపారవేత్తగాను మారింది. అయితే కాజల్ మాత్రం పెళ్లి తరువాత సోషల్ మీడియాలో చేసే రచ్చ మరీ ఎక్కువైంది.
అంతకు ముందు ఎప్పుడో అలా అరకొర పోస్ట్‌లను చేసేది. కానీ ఇప్పుడు మాత్రం కాజల్ తన భర్తకు సంబంధించిన విషయాలు, భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఆ మధ్య ఇద్దరూ కలిసి ఆచార్య సెట్‌లోకి అడుగుపెట్టారు. అలా కొత్త జంట తమ సెట్‌లోకి అడుగుపెట్టడంతో ఆ ఇద్దరిని ఘనంగా స్వాగతించారు. కొత్త జంటతో కేక్ కట్ చేయించారు. ఆ సందర్భంలో బయటకు వచ్చిన ఫోటోలు తెగవైరల్ అయ్యాయి.
అయితే తాజాగా కాజల్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఎలాంటి ప్రశ్నలైనా అడగండి సమాధానం చెబుతాను అని చెప్పుకొచ్చింది. ఇందులో ఓ నెటిజన్ మాత్రం వెరైటీ ప్రశ్నను అడిగాడు. ఏ పనిలో మీకు సంతప్తి కనిపిస్తుంది.. ఏం చేస్తే సంతృప్తి చెందుతారని అడిగాడు. కెమెరాలో తన యాక్టింగ్ తాను చూసుకోవడం, సరిగ్గా వచ్చిందని అనిపిస్తే.. నటించాను అని అనిపిస్తే సంతృప్తిగా ఫీలవుతాను అని చెప్పుకొచ్చింది.