టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు పెళ్లి అయిపోయింది. చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూని వివాహాం చేసుకుంది. అయితే ఈ వివాహంలో రెండు భిన్న సంప్రదాయాలు మిళితమయ్యాయి. పంజాబీ కాశ్మీరి రెండు ఆచారాల సమ్మేళనమే కాజల్ అగర్వార్ పెళ్లి. ఈ విషయంలో కాజల్ అగర్వాత్ స్పందిస్తూ.. చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పంజాబీ కశ్మీరి సంప్రదాయాలతో పాటు దక్షిణాది ఆచారాన్ని పాటించామని చెప్పుకొచ్చింది.
మా పంజాబీ పెళ్లిలో కాశ్మీర్ పెళ్లి సంప్రదాయాన్ని కలిపాము. దాంతో పాటు జీలకర్ర బెల్లాన్ని కూడా కలిపాము. దక్షిణాదికి నేను గౌతమ్ కిచ్లూ ఇచ్చే ట్రిట్యూట్ ఇదే. మామూలుగా తెలుగు సంప్రదాయంలో జీలకర్ర బెల్లం అనేది వధూవరుల మధ్య ఉండాల్సిన ఉండే బంధం గురించి చెబుతుంది. జీలకర్ర, బెల్లం ఎలా కలిసిపోయి అతుక్కుని ఉంటాయో అలా ఉండాలని అర్థం. జీలకర్ర బెల్లం ముద్దను తమలాపాకు మీద పెట్టి.. వేదమంత్రాలు చదువుతూ ఉంటే ఒకరిపై తలపై మరొకరు పెడుతారు.
ఈ తంతు చేస్తున్నప్పుడు వధూవరులు ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటారు. కష్టసుఖాల్లో జీవితాంతం ఒకరొకరు తోడుగా ఉంటాం.. కలిసి జీవిస్తామనే దానికి సంకేతంగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారని కాజల్ తన పెల్లి వేడుకను వివరించించింది. అంతేకాకుండా అద్భుతమైన ఫోటోను కూడా షేర్ చేసింది. ఉత్తరాది పెళ్లిలో తెలుగు సంప్రదాయాన్ని యాడ్ చేసుకుందంటే తెలుగు అభిమానులంటే కాజల్‌కు ఎంత ఇష్టమో ఇక్కడే తెలిసిపోతోంది.