Kajal Aggarwal: కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్.. పాత్రను రివిల్ చేసిన మూవీ మేకర్స్!

Kajal Aggarwal: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్తకన్నప్ప మూవీ గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఏవిఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, రఘు బాబు, ఐశ్వర్య రాజేష్, మొదలైన 20 మందికి పైగా నటులు చారిత్రక పాత్రలు పోషించారు.

కాగా ఇప్పటికే వీరిలో కొంతమంది పాత్రలను రివిల్ చేసిన విషయం తెలిసిందే. కొంతమంది పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలో పార్వతి దేవిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ పోస్టర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. తెల్లటి పట్టు చీరలో, హిమాలయ పర్వతాల అడుగున.. ఒక బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెనుక మహా కాళి అవతారం పొగమంచుతో డిజైన్ చేయబడింది. అంతేకాకుండా, కాజల్ అగర్వాల్ పార్వతి దేవి పాత్రకు చాలా బాగున్నారని అభిమానులు అంటున్నారు.

ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఈ పాత్రకి కాజల్ అగర్వాల్ చాలా బాగా సూట్ అయింది. పోస్టర్ అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఎలా అయినా ఏప్రిల్ 25న విడుదల చేయాలని చిత్ర బృందం గట్టిగానే ప్రయత్నిస్తోంది. మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు మంచు విష్ణు.