ప్రస్తుతం మన ఇండియన్ సినిమా నుంచి అందులోని తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాలు అన్నీ కూడా వరల్డ్ లెవెల్లో ఉండనున్నాయని క్లియర్ గా అయితే అర్ధం అయ్యిపోయింది. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైతే అప్పుడే సెన్సేషన్ ఇక.
కాగా ఈ భారీ సినిమా వరల్డ్ లెవెల్ హంగులతో ఓ సాలిడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండనుండగా రాజమౌళి అయితే ఇంటర్నేషనల్ వైడ్ గా సినిమాలో భారీ ఏక్షన్ సీక్వెలను కొత్తగా తెరకెక్కించేందుకు ప్రత్యేక బృందాలను తీసుకున్నాడు. ఇలా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే భారీ ఖర్చు చూస్తున్న సినిమా బడ్జెట్ పై ఓ అంచనా ఇప్పుడు తెలుస్తుంది.
ఈ సినిమా అయితే మన టాలీవుడ్ నుంచే ఓ నిర్మాత, దర్శకుడు, హీరో నుంచి బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా ఉంటుందట. ఈ సినిమాకి ఏకంగా మేకర్స్ 800 కోట్ల బడ్జెట్ ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. కాగా ఇది కేవలం అంచనా బడ్జెట్ మాత్రమే కాగా ఇది మరింత పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అట.
దీనితో అయితే ఇప్పుడు ఈ సినిమా ఊహించని లెవెల్లో కాస్ట్లీయెస్ట్ టాలీవుడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది అని చెప్పాలి. కాగా ఈ సినిమా అయితే వచ్చే ఏడాది జూన్ నుంచి మొదలు కానుండగా ఈలోపు దర్శకుడు అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయనుండగా మహేష్ కూడా ఫ్రీ అయ్యిపోనున్నాడు.