యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. గతంలో జనతా గ్యారేజ్ వంటి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈ కాంబో మరోసారి సందడి చేయబోయేందుకు వస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఇది 30వ సినిమా కావడంతో దీనికి ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే..!
ఎన్టీఆర్ 30 సినిమాకు మార్చి నెలలో పూజ చేసి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఫిబ్రవరి 24వ తేదీనే సినిమా మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ.. తారకరత్న మృతితో పూజ వాయిదా పడింది. తాజాగా మార్చి నెలలో పూజతో ప్రారంభించి.. ఏప్రిల్ లో షూటింగ్ కూడా ప్రారంభించ బోతున్నట్లు సమాచారం.
ఈ సినిమా ఓ కల్పిత దీవి. పోర్టు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. కథా నేపథ్యం ఈ ట్వంటీయెత్ సెంచరీ కాదని సమాచారం. సెమీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట డైరెక్టర్. అంతేకాకుండా హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం భారీ సెట్ కూడా వేస్తున్నారట. భాగ్య నగరంలో కొంత, ఆ తర్వాత ఏపీలోని విశాఖ, గోవా ఏరియాల్లో మరికొంత షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట. వీఏఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేషాలను ముందుగానే షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాతే జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా మొదలు కాబోతుంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 31 చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించేందుకు నీల్ ప్లాన్ చేస్తున్నారట. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో హీరో, విలన్ రెండూ ఎన్టీఆర్ యేనట. అంతేకాదండోయ్ ఇందులో యంగ్ టైగర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్. ఏది ఏమైనా ఎన్టీఆర్ 30 తర్వాతే ఈ చిత్రం రాబోతుంది.