Jr NTR: మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తోన్న రోజు మరికొద్దిరోజుల్లోనే రాబోతుంది. మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్‌గా భారీ అంచనాల నడుమ తెరకెక్కబోతున్న చిత్ర ఆర్‌ఆర్‌ఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పేరు దేశ నలు మూలలా వినిపిస్తోంది. రిలీజ్ డేట్ కోసం ఇంతకాలం ఎదురు చూసిన అభిమానులు ఇప్పుడు మార్చి 25న విడుదల కానుందన్న విషయం తెలియడంతో తెగ సంబర పడిపోతున్నారు. కరోనా మరియు మరికొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుండడంతో సినీ ప్రేక్షకులు భారతీయ సినిమా ఖ్యాతి మరోసారి వెండితెరపై ప్రదర్శింపబడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే ఆ మూవీకి సంబంధించి ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఇటీవలు పలు ఇంటర్వ్యూల్లో రాజమౌలీ, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు తన అనుభవాలను షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ మధ్య కర్ణాటకలోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన మూవీ మేకర్స్, రిలీజ్‌కు కూడా ఆ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు కేవలం ఇండియాలోనే కాదు అమెరికా లాంటి అగ్ర దేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉందంటే మామూలు విషయం కాదు.
ఇదిలా ఉండగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఇప్పటికే వినూత్నంగా ఇంటర్వ్యూలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. తాజాగా తారక్, చరణ్, సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి ఇంటర్వ్యూ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. అయితే కీరవాణి అడిగిన పలు ప్రశ్నలకు వారు వెరేటీగా సమాధానాలిచ్చారు. తన ఫెవరేట్ సింగర్ ఎవరన్న కీరవాణి ప్రశ్నకు మోహన భోగరాజు, గీత మాధురి అని ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. అంతే కాకుండా యాంకర్ సుమకు మీ సినిమాలో ఏ పాత్ర ఇస్తారన్న కీరవాణి ప్రశ్నకు ఎన్టీఆర్ స్పందిస్తూ, సుమకు నాయనమ్మ లేదా అమ్మమ్మ లాంటి ముసలమ్మ క్యారెక్టర్ ఇవ్వాలని చెప్పారు. ఆమెకు ఛాదస్తం ఎక్కువన్న ఎన్టీఆర్ నోరేసుకుని పడిపోతుందని, ఆమెను చూడగానే గయ్యాలి అత్త పాత్ర గుర్తొస్తుందని చెప్పారు. ఇక తన విషయానికొస్తే సుమకు పంచాయితీలు పరిష్కరించే మధ్యవర్తి పాత్రను ఇస్తే బాగుంటుందని రామ్ చరణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు..