యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత వారం ఫ్యామిలీని తీసుకుని దుబాయ్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ వంటివాటి వల్ల దాదాపు ఆరేడు నెలలు ఇంటి నాలుగు గోడల మధ్యే ఉన్న ఫ్యామిలీని అలా దుబాయ్ వీధుల్లో తిప్పాడు ఎన్టీఆర్. మామూలుగా ఎన్టీఆర్ కొమురం భీం టీజర్ గురించి మొదట వారం రోజులు ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ తరువాత గ్యాప్ తీసుకుని ఈ వెకేషన్‌ను ప్లాన్ చేశాడు.
దుబాయ్ నుంచి కాసేపటి క్రితమే హైద్రాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు ఎన్టీఆర్. ఎయిర్ పోర్ట్‌లో ఎన్టీఆర్ కనిపించగానే కెమెరాలన్నీ అటు వైపు తిరిగాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ తన పెద్దకొడుకు చేతిని పట్టుకుని నడుచుకుంటూ వస్తుండగా.. వెనకాలే ఎన్టీఆర్ శ్రీమతి లక్ష్మీ ప్రణతీ నడిచి వస్తోంది. మొత్తానికి ఈ ఫోటోలు మాత్రం యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోన్నాయి.
గురువారం నుంచి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో జాయిన్ కాబోతోన్నాడట. ఇప్పటికే చలిలో వణుకుతూ ఉన్నా కూడా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాడు రాజమౌళి. సెట్‌లో అందరూ చలికి గజగజ వణుకుతూనే పని చేస్తున్నారు. ఇంకా నీళ్లలోకూడా పని చేయిస్తా అంటూ రాజమౌళి తన యూనిట్‌ను భయపెట్టించాడు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబో సీన్స్ త్వరలోనే పూర్తి కానున్నాయని తెలుస్తోంది.