టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు మెల్లగా పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెంచుతున్నారు. వీలైనంత వరకు పెద్ద సినిమాలే చేస్తున్నారు. ఏడాదికొక సినిమా చేసేవాళ్ళు కూడా పాన్ ఇండియా అంటూ రెండేళ్ల సమయాన్ని తీసుకుంటున్నారు. ఇక దురదృష్టవశాత్తు కరోనా దెబ్బకు మరింత అలస్యమవుతోంది. RRR హీరో తారక్ కు వెండితెరకు గ్యాప్ ఇచ్చి రెండేళ్లవుతోంది.
ఇక వచ్చే ఏడాది కూడా RRR సమ్మర్ లో వస్తుందో లేదో కూడా గ్యారెంటీ లేదు. జక్కన్న 2022 సంక్రాంతికి రావచ్చని అన్నప్పటీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది దసరా లోపలి వరకు రావచ్చని టాక్ అయితే గట్టిగా వస్తోంది. ఇక ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్న KGF డైరెక్టర్ ప్రశాంత్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు ఒక కొత్త టాక్ వస్తోంది. అప్పట్లో మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబోని సెట్ చేయడానికి గట్టిగానే ప్రయత్నం చేసింది.
ఏమైందో ఏమో గాని సడన్ గా దర్శకుడు ప్రభాస్ తో సలార్ సినిమాను ఎనౌన్స్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు కన్ఫ్యూజన్ లో పడ్డారు. వచ్చే ఏడాది తరువాత కూడా తారక్ అయితే దొరకడు. వెంటనే త్రివిక్రమ్ సినిమాను కూడా పూర్తి చేయాలి కాబట్టి డేట్స్ దొరకవు అనుకున్నాడో ఏమో గాని ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమాను ఎనౌన్స్ చేశాడు. మరి ఎన్టీఆర్ తో సలార్ సినిమాను పూర్తి చేసిన తరువాత స్టార్ట్ చేస్తాడా.. అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.