ఎన్టీఆర్ మాస్ విశ్వరూపానికి నార్త్ ఆడియెన్స్ ఫిదా..అంతలా ఏమంటున్నారంటే!

ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమా మాట వస్తే మన తెలుగు సినిమాలే అందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కో భారీ సినిమా టోటల్ పాన్ ఇండియన్ వైడ్ ఓ రేంజ్ లో రీచ్ తో దుమ్ము లేపుతున్నాయి. అయితే ఎంత పాన్ ఇండియా సినిమా అయినా ఆడియెన్స్ ని పుల్ చెయ్యాల్సింది మాత్రం హీరోనే. ఇప్పుడు పాన్ ఇండియా లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన సత్తా చూపిస్తున్నాడు.

రీసెంట్ గా వచ్చిన ట్రిపుల్ ఆర్(RRR) తో ఏమో కాని ఇప్పుడు రాబోతున్న తన 30వ సినిమా కొరటాల శివతో ప్లాన్ చేసిన దానితో అయితే కుంభస్థలం బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడు. నిన్న మేకర్స్ ఎన్టీఆర్30 నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మాస్ వీడియో ని రిలీజ్ చేశారు. అయితే అందులో కొన్ని మోషన్స్ తో కేవలం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మాత్రమే ఉంది. తెలుగులో అయితే ఎలాగో సాలీడ్ రెస్పాన్స్ వస్తుంది ఇది అందరికీ తెలిసిందే.

కానీ హిందీ వెర్షన్ లో వస్తున్న రెస్పాన్స్ మాత్రం ఊహించనిది అని చెప్పాలి. హిందీలో ఆడియెన్స్ ఎన్టీఆర్ హిందీ మాటల మాస్ విశ్వ రూపానికి, అతని డైలాగ్ డెలివరీ విని ఫిదా అయ్యిపోయారు. అక్కడి చాలా మంది హిందీ స్టార్స్ కూడా చెప్పలేని విధంగా ఎన్టీఆర్ హిందీ అద్భుతంగా ఉందని ఇంకా తమ అభిమాన హీరో షారుఖ్ తర్వాత అంతా పవర్ ఫుల్ గా హిందీలో డైలాగ్ చెప్పింది ఎన్టీఆర్ అని అంతా ఒక రేంజ్ లో పొగిడేస్తున్నారు.

మొత్తానికి అయితే ఎన్టీఆర్ జస్ట్ తన వాయిస్ తోనే నార్త్ ఆడియెన్స్ అటెన్షన్ ని తెచ్చేసుకున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ నాటికి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే ఈ ఫీడ్ బ్యాక్ అంతా హిందీ వీడియో పెట్టిన బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరన్ ఆదర్శ్ ట్వీట్ కింద చెయ్యడం జరిగింది. అతని ట్వీట్ కింద కామెంట్స్ చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ డెఫినెట్ గా ఓ రేంజ్ లో ఎగ్జైటింగ్ గా ఫీల్ అవ్వడం ఖాయం.