తన అసిస్టెంట్ కొరియర్ గ్రాఫర్ పై లైంగిక వేధింపులకు కారణంగా జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కి ఇంకా కష్టాలు తీరినట్లు లేదు. మళ్లీ ఆయన గురించి మరొక వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తుంది. ఆయనని కొరియోగ్రాఫర్ల సంఘం నుంచి శాశ్వతంగా తొలగించారనే వార్తలు వైరల్ గా మారాయి. దీంతో సినీ పరిశ్రమలో కలకలం మొదలైంది. అయితే ఈ విషయంపై జానీ మాస్టర్ వెంటనే స్పందించారు.
వీడియో రూపంలో పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే ఉదయం నుంచి నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంది, నన్ను డాన్సర్ల సంఘం నుంచి శాశ్వతంగా తొలగించారని జరుగుతున్న ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు, నన్ను ఎవరూ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తొలగించలేదు. నేను డాన్స్ రిహార్సల్స్ లో ఉన్నాను మంచి పాటతో మళ్ళీ మీ ముందుకి వస్తాను, అసత్య వార్తలు నమ్మొద్దు.
నేను ప్రతి యూనియన్ లోని పనిచేయవచ్చు. నా దగ్గర పని చేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు ఇప్పుడు డాన్స్ మాస్టర్లు అయ్యారు అందులో మోయిన్, యాని, శిరీష్, భాను డాన్స్ మాస్టర్స్ గా బిజీగా ఉన్నారు. మరి కొందరు త్వరలోనే డాన్స్ మాస్టర్లు కాబోతున్నారు ప్రతిభను ఎవరు తొక్కలేరు అని చెప్పాడు. అలాగే నా కొరియోగ్రఫీలో గేమ్ చేంజర్ సినిమా నుంచి ఒక మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పాడు.
ఇక తన పదవీకాలం ముగియకుండానే అనైతికంగా అనధికారికంగా ఎన్నికలు నిర్వహించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నా పదవీకాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా అనైతికంగా ఎలక్షన్స్ నిర్వహించి వారికి వారే నిర్ణయాలు హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. ఆ విషయంగా నేను ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్నాను ఆ వివరాలు కూడా త్వరలోనే చెప్తాను అంటూ తనపై వస్తున్న వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు జానీ మాస్టర్.
నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!
నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి… pic.twitter.com/qroJxE5Uxv
— Jani Master (@AlwaysJani) December 9, 2024