అమ్మ బాబోయ్ జానీ మాస్టర్ ఇలా మారిపోయాడేంటి.. సాహసమనే చెప్పాలి!

జానీ మాస్టర్ టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రఫర్. సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఓ ఊపు ఊపేసిన రౌడీ బేబీ పాటలో జానీ మాస్టర్ భాగం కూడా ఉంది. అది కాసేపు పక్కన పెడదాం. సౌత్ నార్త్ అని కాకుండా దేశాలు, ఖండాంతరాలు దాటిన బుట్టబొమ్మను క్రియేట్ చేసింది జానీ మాస్టర్. స్టైలీష్ స్టార్‌కు మరింత స్టైలీష్, క్లాస్ స్టెప్పులను కంపోజ్ చేయడంతో ఆ పాట, ఆ మూమెంట్స్ ఖ్యాతీ ఖండాంతరాలు దాటింది.

Jani Master Lady Getup In zee Telugu dasara 2020 Event

ఇప్పుడు జానీ మాస్టర్ క్రేజ్ వేరే లెవెల్. అలాంటి మాస్టర్ ఇప్పుడు లేడీ గెటప్ వేసుకుని ఓ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అంతటి స్టార్ కొరియోగ్రాఫర్‌కు లేడీ గెటప్ వేసుకుని డ్యాన్స్ చేయాల్సిన అవరసం లేదు. దాని కోసం మీసం, గడ్డాలు తీసేసి మరి సాహసం చేశాడు. ఇదంతా జీ తెలుగు దసరా ఈవెంట్ కోసం. తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. అందులో జానీ మాస్టర్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు.

ఢీ ఫేమ్ డ్యాన్సర్ పండు చోలికే పీచే క్యా హై అంటూ లేడి గెటప్‌లో వచ్చాడు. ఆ తరువాత మా అక్కను చూడండి అంటూ జానీ మాస్టర్‌ను చూపించాడు. మొదటగా వచ్చింది జానీ మాస్టర్ అని ఎవ్వరూ గుర్తు పట్టలేరు. అంతగా సూట్ అయిపోయాడు జానీ మాస్టర్. అయితే లేడీస్ డ్యాన్స్ చేయడం, వ్యాక్స్ చేయించుకోవడం, తయారవ్వడంలో ఉన్న ఇబ్బందులు చెబుతూ.. మాదేముంది ప్యాంట్ చొక్కా వేసేసుకునిఅలా ఇలా స్టెప్పులేస్తాం.. కానీ ఆడవాళ్లే గ్రేట్ అంటూ సలామ్ కొట్టేశాడు. ఇలా జానీ మాస్టర్ ఆడవాళ్ల గురించి గొప్పగా చెప్పడం, లేడీ గెటప్ వేసుకుని డ్యాన్స్ చేయడంతో అందరూ ఫిదా అయ్యారు.

https://www.youtube.com/watch?v=4EPj9J5n5Cw&feature=youtu.be