Janasena: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు ముందు కాస్త పొలిటికల్ సెగ కూడా తగిలిన సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమాకు రాజకీయాల పరంగా కూడా కాస్త ఇబ్బందులు వచ్చాయి. కొన్ని చోట్ల ఈ సినిమాని భాయ్ కాట్ చేయాలి అంటూ డిమాండ్ చేయగా మరికొన్ని చోట్ల ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ కొంతమంది రాజకీయ నాయకులు డిమాండ్లు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జనసేన నేత చలమశెట్టి రమేష్ సైతం పుష్ప 2 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవర్ కళ్యాణ్ కి కాకుండా అల్లు అర్జున్ తన స్నేహితుడు వైకాపా నాయకుడు శిల్ప రవికి మద్దతు తెలుపుతూ చాలా అహం ప్రదర్శించారు. ఈయన వ్యవహార శైలి కారణంగా జనసైనికులు మెగా అభిమానులు ఎంతో ఇబ్బంది పడ్డాము. అహం నెత్తిన పెట్టుకొని ప్రవర్తించిన అల్లు అర్జున్ ఇప్పటికైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి ఆ నీటిని తన నెత్తిపై చల్లుకోవాలి లేకపోతే పుష్ప 2 సినిమాని అడ్డుకుంటాము అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విధంగా సినిమా గురించి రమేష్ బాబు చేస్తున్న ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు .ఈ సినిమాపై మరోసారి ఈయన స్పందించారు. మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎవరి వృత్తులకు, వ్యాపారాలకు జనసేన అడ్డుపడదన్న సందేశాన్ని నాగబాబు ఇచ్చారన్నారు.
ఇలా ఈ సినిమా విషయంలో నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ ఈయన మరొక వీడియోని విడుదల చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు సినిమా ఎలాగో హిట్ అవుతుంది ఇలాంటి వారు ఎంతమంది అడ్డుపడిన ఏం చేయలేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంతో అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంది.