ఆది డైరెక్షన్‌లో మెగా మూవీ.?

జబర్దస్త్‌ ప్రోగ్రాంతో హైపర్ ఆదిగా పాపులర్ అయ్యాడు. మంచి టాలెంట్ వున్నోడు. మెగా కుటుంబానికి భక్తుడు అయిన ఆది, త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నాడనీ గుసగుస.

మెగా కుటుంబంలో ఓ యంగ్ హీరోని డైరెక్ట్ చేసేందుకు ఆది రెడీ అవుతున్నాడట. ఆది మంచి రైటర్ అన్న సంగతి తెలిసిందే. పంచ్ డైలాగులు బాగా రాస్తాడు.

ఈ మధ్య సినిమాల్లో బాగా బిజీ అయిపోయాడు డైలాగ్ రైటర్‌గా. పెద్ద హీరోల సినిమాలకు సైతం డైలాగ్స్ రాస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ మెగా హీరోతో ఆది సినిమా త్వరలో వుండబోతోందనీ తెలుస్తోంది.

డైలాగ్ రైటింగ్‌లో ఎంత పట్టున్నా.. ఎందుకో ఆది డైరెక్షన్ అంటే తటపటాయిస్తున్నాడట. అటు చిరంజీవి నుంచీ, ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కూడా మంచి సపోర్ట్ వుంది ఆదికి. ‘బలగం’ సినిమాతో జబర్దస్త్ వేణు డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

అలాగే, ఆది కూడా డైరెక్టర్‌గా సత్తా చాటుతాడేమో చూడాలి మరి. మెగా కాంపౌండ్ నుంచి ఆది డైరెక్ట్ చేయబోయే వారిలో సాయి ధరమ్ తేజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు విషయం తేలాల్సి వుంది.