జబర్దస్త్ వేదికపై లేడీ గెటప్పుల ద్వారా కొందరు ఫేమస్ అయ్యారు. అయితే క్రేజ్ వచ్చింది కానీ చెడు అభిప్రాయం పెరిగింది. ఎప్పుడూ లేడీ గెటప్పులు వేసుకుంటూ ఉండటంతో వారు కూడా అమ్మాయిలా మారిపోయారేమో లేదా తేడా అంటూ కామెంట్లు వినిపిస్తుంటాయి. అయితే లేడీ గెటప్పులు వేసుకుని నిజంగానే అమ్మాయిల వారిని వారుకూడా ఉన్నారు. అయితే తాజాగా జబర్దస్త్ ఫేమ్ శాంతి స్వరూప్ పెళ్లి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టించేశాడు.
జబర్దస్త్ లేడీ గెటప్పులు వేసే ఆర్టిస్ట్‌లందరూ సుమ క్యాష్ షోలో గెస్ట్‌లుగా వచ్చారు. అయితే ఈ షోలో లేడీ గెటప్పులు వేసుకున్న వారంతా.. మళ్లీ తమ తమ ఒరిజనల్ గెటప్పుల్లోనూ దర్శనమిచ్చారు. వారి ఒరిజినల్ గెటప్పులు చూసి ప్రతీ ఒక్కరూ షాక్ అవుతారు. అయితే అందులో శాంతి స్వరూప్ మాట్లాడిన మాటలు అందర్నీ కంటతడిపెట్టించాయి. పెళ్లిపై నీ అభిప్రాయం ఏంటి అని సుమ శాంతి స్వరూప్‌ను అడిగింది. అందుకు శాంతి స్వరూప్ చెప్పిన సమాధానం ఎమోషనల్ అయ్యేలా ఉంది.
మేం లేడీ గెటప్పులు కేవలం ఫ్రొఫెషనల్ కోసమే చేస్తాము.. మా ఫ్యామిలీని పోషించుకోవడం కోసమే ఆ గెటప్పులు వేస్తామని రియల్ లైఫ్‌లో అలా కాదని మమ్మల్ని అర్థం చేసుకున్న వారు వస్తే పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూ ఎమోషనల్‌కు గురి చేశాడు. ప్రొఫెషనల్ వరకు అలా ఉంటారు.. బయటకు వస్తే జెంట్స్ అని అర్థం చేసుకుంటేనే పెళ్లి అని శాంతి స్వరూప్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో లేడీ గెటప్పులు వేసుకోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, సమజాం ఎలా చూస్తుందో చెప్పి అందర్నీ కంటతడి పెట్టించారు.