తొలిసారిగా హీరోగా ప్రేక్షకుల ముందుకి రానున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్..?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో ఆటో రామ్ ప్రసాద్ కూడా ఒకరు. రాంప్రసాద్ జబర్దస్త్ లో వేసే ఆటో పంచులతో బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారికి సినిమాలలో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, హైపర్ ఆది వంటి వారికి ఏకంగా హీరోగా అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమా విడుదలయ్యింది. తర్వాత కూడా శ్రీను, సుధీర్, ఆది ఎన్నో సినిమాలలో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఆటో రాంప్రసాద్ కూడా హీరోగా ఒక సినిమాలో నటించాడు . ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల కూడా విడుదలైంది. సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై టి.వి.ఎన్.రాజేష్ సమర్పణలో క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో అమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం “పీప్ షో”. ఈ సినిమాలో జబర్దస్త్ రాం ప్రసాద్ మొదటిసారిగా హీరోగా నటించాడు.ఇక ఈ సినిమాలో నేహాదేశ్ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవల చిత్ర బృందం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.

బీప్ షో అంటే దొంగచాటుగా తొంగి చూడటం అని అర్థం. క్రాంతి కుమార్ సి హెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ సంగీతాన్ని అందిస్తన్నాడు. అయితే ఆయన అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకముందని చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో రంజిన్ రాజ్ మాట్లాడుతు తన చిరకాల మిత్రుడు క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ “పీప్ షో” చిత్రంతో తెలుగులో పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు చెప్పుకొచ్చాడు. ఈ “పీప్ షో” సినిమా దర్శకుడిగా తన మిత్రుడు క్రాంతి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందని హీరో రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.