జబర్దస్త్ షోలో రోజా వేసే పంచ్‌లు అందరికీ తెలిసిందే. టీం లీడర్లు, ఇతర ఆర్టిస్ట్‌లు వేసే సెటైర్లను కూడా రోజా ముందుగానే వేసేస్తుంది. అలా స్కిట్ల మధ్యలో దూరి రోజా వేసే పంచ్‌లు, ఆర్టిస్ట్‌ల మీద రోజా వేసే సెటైర్లు బాగానే పాపులర్ అయ్యాయి. అలా ఓ ఆర్టిస్ట్‌ను రోజా తన పంచ్‌లతోనే ఫేమస్ చేసింది. ఇమాన్యుయేల్ మొదట రోజా చేత తిట్లు తింటూ.. సెటైర్లు వేయించుకుంటూనే ఫేమస్ అయ్యాడు. ఆ తరువాతే వర్ష ట్రాక్‌తో మరింత హైలెట్ అయ్యాడు.
అలా ఇమాన్యుయెల్‌ను మొదటినుంచి కూడా రోజా ఎంకరేజ్ చేస్తూనే వచ్చింది. కావాలనే వర్ష ఇమాన్యుయెల్ ట్రాక్‌ను బాగా హైలెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. గత వారంలో ఎపిసోడ్‌లోనూ రోజా అందరి ముందే అడిగేసింది. ఏదో నడుస్తోందంటూ వర్ష, ఇమాన్యుయెల్‌ను నిలబెట్టి మరి కడిగేసింది. మొత్తానికి ఏదో నడుస్తోందంటూ రోజా కూడా హింట్ వదిలేసింది. తాజాగా రోజాపై ఇమాన్యుయల్ కామెంట్ చేశాడు.
రీసెంట్‌గా ఇమాన్యుయల్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టాడు. ఆ క్రమంలో రోజా గురించి చెప్పమని కొందరు అడిగారు. అలా నెటిజన్లు అడిగిన సందర్భంలో రోజా గురించి ఇమాన్యుయెల్ తన మనసులో మాటలు చెప్పేశాడు. ఆమెను అమ్మా అని పిలుస్తాను.. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు.. నాకు చాక్లెట్ బాయ్ అని పేరు పెట్టారు.. ఇప్పుడు అందరూ అదే పేరుతో పిలుస్తున్నారు.. చాలా హ్యాపీగా ఉంది.. థ్యాంక్యూ రోజా అమ్మ అంటూ ప్రేమను కురిపించాడు.