పూర్వవైభవం కోల్పోతున్న జబర్దస్త్ షో.. ఇకపై టీఆర్పీ రేటింగ్ కష్టమే..?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏళ్ల తరబడి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, ఎంతోమంది కమెడియన్ లకు లైఫ్ ఇచ్చిన షో జబర్దస్త్. ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లు ఈ జబర్దస్త్ ద్వారా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. క్రమంగా యూట్యూబ్ లో జబర్దస్త్ నుంచి చూసే ప్రేక్షకుల సంఖ్య కోట్లకు చేరుకుంటుంది. ఇక ప్రతి గురు శుక్రవారాలలో జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, వేణు, ధనరాజ్, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది లాంటి కమెడియన్లు వెండితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ పూర్వవైభవం కోల్పోతోంది. క్రమక్రమంగా ఒక్కొక్కరు జబర్దస్త్ షోని వీడి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే జడ్జ్ నాగబాబు వెళ్లిపోవడంతో ఆయనతో పాటు పలువురు కమెడియన్ లు జబర్దస్త్ షో నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఇటీవల తాజాగా రోజా తనకు మంత్రి పదవి దక్కడంతో జబర్దస్త్ షోకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ లో రోజా లేకపోవడం అన్నది ఒక తీరని లోటు అని చెప్పవచ్చు. హీరోయిన్ రోజా కాస్త జబర్దస్త్ జడ్జి రోజాగా మారింది. ఇది ఇలా ఉంటే జబర్దస్త్ షోలో నుంచి కమెడియన్ హైపర్ ఆది కూడా బయటకు వెళ్లిపోయినట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అయితే అందుకు గల కారణం మాత్రం తెలియడం లేదు. కానీ సినిమా ఆఫర్స్, కొత్త షోలో అవకాశం రావడం వల్ల హైపర్ ఆది జబర్దస్త్ నుంచి విడిపోయారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఇంకా రాను రాను టిఆర్పి రేటింగ్ కష్టమే అని చెప్పవచ్చు.