Dil Raju: ఐటీ రెయిడ్స్.. దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం..

టాలీవుడ్‌లో ఇటీవల సినిమాల కలెక్షన్లపై జరుగుతున్న చర్చలు కొత్త మలుపు తిసుకున్నాయి. పలు పెద్ద సినిమాల మేకర్స్ తమ సినిమాలకు వందల కోట్ల కలెక్షన్లు వచ్చాయని ప్రకటిస్తున్న పరిస్థితుల్లో, ఆ లెక్కలు ఎంతవరకు నిజమో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సినీ ప్రముఖులపై దృష్టి సారించారు.

గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాల నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఈ సోదాల్లో అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డి ఇంట్లోనూ డాక్యుమెంట్లను చెక్ చేశారు. ఐటీ అధికారులు ప్రస్తుతం సేకరించిన సమాచారం ఆధారంగా తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.

ఇదే సమయంలో పుష్ప-2 సినిమా నిర్మాతలపై కూడా ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఈ సినిమా ద్వారా రూ. 1,800 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే, పన్నుల చెల్లింపుల్లో అసమానతలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో 18 ప్రాంతాల్లో 55 బృందాలతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు టాలీవుడ్‌లో కలకలం రేపాయి. మేకర్స్ ప్రకటించే కలెక్షన్ల లెక్కలపై నిజత్వం లేదని వస్తున్న విమర్శలతో ఈ సోదాలు పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ దాడుల ఫలితాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.

APTA & Chimata Music Founder Chimata Sreenivas Gaari Interview || Telugu Rajyam