అసలైన సమ్మర్ అంటే అది కదా..

ఈ ఏడాది రావాలని అనుకున్న కొన్ని పెద్ద సినిమాలు వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయినట్లు అర్థమవుతుంది. దాదాపు అన్ని వర్గాల అభిమానులకు కూడా 2024 ఒక బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ ను అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ వద్ద 2024 సమ్మర్ లో అతిపెద్ద బిజినెస్ కూడా జరగబోతున్నట్లు తెలుస్తోంది.

మెగా హీరోల నుంచి నందమూరి హీరోల వరకు అలాగే ప్రభాస్ అల్లు ఫ్యాన్స్ కు కూడా పునకాలు తెప్పించే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా 2024 సమ్మర్లో మొదటగా రామ్ చరణ్ RC 15వ వస్తుండగా ఆ తర్వాత మళ్లీ ఏప్రిల్ 4వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఆ రెండు సినిమాల హడావిడి ముగిసిన తర్వాత మళ్లీ వెంటనే అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా గ్రాండ్గా విడుదలయ్యే అవకాశం ఉంది ఇక దీని హడావిడి ముగిసిన తర్వాత ప్రభాస్ 21వ సినిమా మరింత డిఫరెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతి ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక వీటితోపాటు మరొక రెండు మెగా సినిమాలు కూడా సమ్మర్ లోనే రాబోతున్నాయి ముందుగా మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా వచ్చే ఏడాది మే నెలలో వచ్చే అవకాశం ఉంది. వెంకీ కుడుముల ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇక తర్వాత దాదాపు అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా గ్రాండ్ గా విడుదల కానుంది. వీటితో పాటు మరికొన్ని మిడియం రేంజ్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది.