అప్పుడే విజయ్ భారీ ప్రాజెక్ట్ కి కాపీ మరకలు.!

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ పేరు రీసెంట్ గా గత కొన్ని రోజులు నుంచి సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తూ వచ్చింది. ముందుగా అయితే యాంకర్ అనసూయ స్టార్ట్ చేయగా దేవరకొండ యూనిట్ దాన్ని గట్టి కౌంటర్లు తో మరింత వైరల్ చేసారు.

ఇక నిన్న విజయ్ పుట్టినరోజు కావడంతో తన నెక్స్ట్ సినిమాలపై పలు అప్డేట్ లు అనౌన్సమెంట్ లు కూడా రాగా ఈ చిత్రాల్లో ప్రముఖ యంగ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో అనౌన్స్ చేసిన భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తున్న ఈ సినిమా నుంచి నిన్ననే మేకర్స్ ఓ పోస్టర్ ని అయితే రిలీజ్ చేయగా దానికి అనూహ్య స్పందన వచ్చింది.

అయితే ఇది వచ్చి ఇంకా 24 గంటలు కూడా పూర్తి కాక ముందే ఈ సినిమా కాపీ అంటూ ప్రూఫ్ లు కూడా వచ్చేసాయి. అయితే ఈ సినిమాని హాలీవుడ్ చిత్రం “ఆర్గో” అనే సినిమా పోస్టర్ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా పోస్టర్ కూడా నిన్న విజయ్ సినిమా పోస్టర్ లానే దాదాపు ఉంది.

దీనితో ఈ సినిమా కాపీనా లేక పోస్టర్ వరకూనా అంటూ ఓ టాక్ వైరల్ గా మారింది. అయితే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ తెలుస్తుంది. ఈ సినిమాకి ఆ సినిమాకి సంబంధం లేదని పైగా రెండు పోస్టర్స్ కూడా జస్ట్ యాదృచ్చికంగా కలిసినవి మాత్రమే అని కాన్సెప్ట్ తాము అలా అనుకున్నామని యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు.

కానీ ఇది పోస్టర్ వరకే కాదు సినిమా కాన్సెప్ట్ కూడా కాపీ అన్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఇలా కాన్సెప్ట్ పోస్టర్ తోనే అప్పుడే కాపీ మరకలు పడిపోయాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరికీ క్లారిటీ వస్తుంది.