జబర్దస్త్‌లో వర్ష అవుట్.. ఇకపై ఇమాన్యుయేల్ ఒంటరి!!

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో ఇమాన్యుయేల్, వర్షలు కలిసి చేసే స్కిట్లకు ఎంత క్రేజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ వేదిక మీద మరో కొత్త జంట పుట్టిందని అందరూ అనుకున్నారు. జబర్దస్త్ టీం కూడా వర్ష ఇమాన్యుయేల్ మీద బాగానే ఫోకస్ పెట్టేశారు. వారిపైనే ప్రోమోలు, వారిపై స్పెషల్ స్కిట్లను ప్లాన్ చేసేశారు. అలా వారి జోడి కూడా బాగానే క్లిక్ అయింది. అయితే వర్ష ఇమాన్యుయేల్ జంటకు మంచి డిమాండ్ ఉన్న ఈ సమయంలో ఆమెను పక్కన పెట్టేసినట్టున్నారు. అయితే దానికి స్పష్టమైన కారణం మాత్రం తెలియడం లేదు.

Is Varsha Out From Jabardasth Show
Is Varsha Out From Jabardasth Show

వచ్చేవారం రానున్న ఎపిసోడ్‌లకు సంబంధించిన ప్రోమోలు తాజాగా బయటకు వచ్చాయి. ఇందులో జబర్తస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల్లో ఇమాన్యుయేల్ స్కిట్లు వేశాడు. ఇమాన్యుయేల్ పక్కన వేరే అమ్మాయి ఉంది. ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో ఇమాన్యుయేల్ పెళ్లి స్కిట్ వేశాడు. అందులో వర్ష ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ లేదు. అంతే కాకుండా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కెవ్వు కార్తీక్ కూడా కనిపించలేదు. మాములుగా ఆ టీంలోనే వర్ష ఇమాన్యుయేల్ కలిసి రచ్చచేస్తారు.

ఇక జబర్దస్త్‌లోనూ ఇమాన్యుయేల్ స్కిట్లు చేస్తుంటాడు. కానీ వచ్చే వారం మాత్రం అక్కడా ఇక్కాడా ఎక్కడా కూడా వర్ష కనిపించలేదు. ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల ఎపిసోడ్‌ షూటింగ్‌లకు హాజరు కాలేదా? లేదా ఇకపై మళ్లీ ఎప్పుడూ కూడా కనిపించదా? అన్నది తెలియడం లేదు. పైగా ఇక్కడ మళ్లీ ఓ విచిత్రం కూడా ఉంది. ఎక్స్ ట్రా జబర్తస్ద్‌లో రోజా మళ్లీ సుధీర్ రష్మీ జంటను పైకి లేపే ప్రయత్నం చేసింది. మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? చూడాలని ఉంది అంటూ ఆ ఇద్దరిని అడిగేసింది. మామూలుగా ప్రతీసారి వర్ష ఇమాన్యుయేల్‌లను అడిగేది కానీ ఈ సుధీర్ రష్మీ జంటను అడిగేసింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles