తమ్ముడు ప్రేమలో పడ్డాడు.!

ఇదేమీ సినిమా టైటిల్ కాదండోయ్. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ విషయంలో జరుగుతోన్న ప్రచారం ఇదంతా. అవునండీ.! వైష్ణవ్ తేజ్ ఓ అందాల భామతో ప్రేమలో పడ్డాడట. ఓ హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. తనతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న హీరోయిన్‌తోనే వైష్ణవ్ తేజ్ బాగా రాసుకు పూసుకు తిరుగుతున్నాడట.

ఇదీ ఈ ప్రచారం తాలూకు సారాంశం. అయినా, సినీ రంగంలో ఈ తరహా పుకార్లకు కొదవే వుండదు. గతంలో సాయి ధరమ్ తేజ్ విషయంలోనూ ఇలాంటి పుకార్లు వినిపించాయ్. రెజీనాతో సాయి ధరమ్ తేజ్ బాగా క్లోజ్‌గా వుంటున్నాడట అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అదంతా హంభక్ అని తేలింది.

ఇప్పుడు వైష్ణవ్ తేజ్ వంతొచ్చింది. ‘కొండపొలం’ సినిమా టైమ్‌లో రకుల్‌తో ప్రేమలో పడ్డాడనీ, ఆ తర్వాత కేతిక శర్మకు క్లోజ్ అయ్యాడనీ.. ఇప్పుడేమో ఇదిగో ఇలా..! ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’ సినిమాతో పాటూ మరి కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయనతో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న హీరోయిన్లలో ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీల కూడా వుంది.