రష్మికను బ్యాన్ చేయడానికి సిద్ధమైన కన్నడ ఇండస్ట్రీ.. ఆ వివాదమే కారణమా?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమై వివిధ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె ఒక వివాదంలో చిక్కుకున్నారు.తనకు ఇతర భాషలతో పోలిస్తే కన్నడ భాషలో మాట్లాడడమే కష్టంగా ఉంటుందని ఈమె కామెంట్లు చేయడమే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమకు ఎంతో అద్భుతమైన విజయాన్ని అందించిన కాంతర సినిమా చూసే టైం నాకు లేదంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ విషయం గురించి హీరో రిషబ్ శెట్టి కూడా పరోక్షంగా రష్మికకు సెటైర్లు వేశారు. అయితే సొంత భాష చిత్రం గురించి రష్మిక ఇలాంటి కామెంట్లు చేయడంతో కన్నడ ప్రేక్షకులు తన పట్ల ఎంతో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తీవ్రస్థాయిలో రష్మికను విమర్శిస్తున్నారు.తనకు ఎంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చినప్పటికీ ఇలా మాతృభాషను మాతృభాష సినిమాలను అగౌరవపరచడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే కన్నడ భాష పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ గురించి రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని కన్నడ చిత్ర పరిశ్రమ తనపై బ్యాన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారట.

ఈ క్రమంలోనే రష్మిక పై కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ విధిస్తే ఆమె నటించినటువంటి పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటి? ఈ సినిమాలకు కన్నడ భాషలో నష్టాలు తప్పవా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈమె నటిస్తున్న పుష్ప 2 సినిమాపై భారీ ప్రభావం చూపనుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసే విషయంపై రష్మిక స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.