సాయి పల్లవి సినిమాలు రిజెక్ట్ చేయటానికి అదే కారణమా…?

ఫిదా సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి పల్లవి మొదటి సినిమాలోనే తన సహజమైన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఉన్న ఈ గ్లామర్ ప్రపంచంలో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది. ఇలా సాయి పల్లవి నటించిన సినిమాలో అన్ని దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే గత కొంతకాలంగా సాయి పల్లవి సినిమా ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా మాత్రమే ఉండటం గమనార్హం. అయితే ఇలా సాయి పల్లవి అవకాశాలను తిరస్కరించటంతో దీనికి గల కారణాల గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి సాయి పల్లవిని ప్రశ్నించగా కొంతకాలం తన పర్సనల్ లైఫ్ కోసం సమయాన్ని కేటాయించడానికి ఆఫర్లు రిజెక్ట్ చేస్తున్నట్లు తన అభిప్రాయం వెల్లడించింది. అయితే కెరీర్ మంచి పీక్ లో ఉన్న సమయంలో సాయి పల్లవి ఇలా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా సాయి పల్లవి తల్లిదండ్రులు ఆమె పెళ్లి విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రుల కోసం సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటూ తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సాయి పల్లవి స్పందించాల్సి ఉంటుంది.