హీరోయిన్ కంటే చాలా ఎక్కువ.. కాని ఐటం బాంబ్ ని చేసేశారు ..పాపం..?

ప్రస్తుతం సౌత్ అండ్ నార్త్ సినిమాలలో ఖచ్చితంగా ఐటం సాంగ్ ఉండాల్సిందే. హిందీ, తెలుగు, తమిళం.. ఇలా ఏ భాష అయినా సినిమాలో ఒక ప్రత్యేకమైన సెట్.. హాట్ బ్యూటీ కాంబినేషన్ లో స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. సినిమాకి ఈ సాంగ్ కొన్నిసార్లు బాహా హెల్ప్ అవుతుంది. ఆ సాంగ్ కోసమే రిపీటెడ్ గా ఆడియన్స్ థియోటర్స్ కి వస్తుంటారు. అంతేకాదు ఒకప్పుడు జ్యోతిలక్ష్మీ, జయమాలిని, డిస్కో శాంతి లాంటి వాళ్ళకి స్పెషల్ సాంగ్స్ పరంగా ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉండేది. ఒక సినిమాకి హీరోయిన్ ఎంతగా ఇంపార్టెంటో ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ కి ఎంచుకునే హాట్ బ్యూటీ అంత అవసరం అని మేకర్స్ ఆలోచించే వాళ్ళు.

Baahubali song Manohari: Prabhas grooves with Nora Fatehi and Scarlett  Wilson in this sexy middle eastern number! - Bollywood News & Gossip, Movie  Reviews, Trailers & Videos at Bollywoodlife.com

అయితే ఇప్పుడు ఇలాంటి ఐటం సాంగ్స్ కోసం ఏకంగా స్టార్స్ హీరోయిన్స్ నే మేకర్స్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకుంటున్నారు. ఈ ఐటం సాంగ్స్ లో ఇప్పటికే సౌత్ లో స్టార్స్ గా వెలుగుతున్న తమన్నా, శృతి హాసన్, కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి లాంటి వాళ్ళు హీరోల పక్కన చిందులేశారు. ఇదంతా ప్రేక్షకుల్లో క్రేజ్ కోసమే అని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని సార్లు ఇలాంటి ఐటం సాంగ్స్ కోసం బాలీవుడ్ నుంచి మోడల్స్ ని హీరోయిన్స్ ని తీసుకు వస్తున్నారు. వీళ్ళలో కొంతమంది హీరోయిన్ కంటే ఏమాత్రం తీసిపోరు.

Nora Fatehi to come out with her third single this year

కాని ఎందుకనో వాళ్ళని ఐటం బాంబ్ గానే పరిగణిస్తున్నారు. అలాంటి బ్యూటీనే నోరా ఫతేహి. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన పాన్ ఇండియన్ సినిమా బాహుబలి సినిమాలో బిగినింగ్ లో మనోహరి అన్న సాంగ్ ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సాంగ్ లో ముగ్గురు ఐటం గళ్స్ కనిపిస్తారు. కాని విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంది మాత్రం నోరా ఫతేహి. ఈ సినిమా తర్వాత టెంపర్, లోఫర్ లాంటి సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా క్రేజీ బ్యూటీగా పాపులారిటీని సంపాదించుకుంది. మరి ఈ బ్యూటీలో హీరోయిన్ కోణం ఏ దర్శక నిర్మాతలకి కనిపించలేదా అని చాలా సందర్భాలలో అభిమానులు అనుకున్నారట.