సంయుక్త చేజారిన కొత్త ప్రాజెక్ట్.! కారణమేంటి.?

ఓ పెద్ద సినిమాలో ఇంపార్టెంట్ రోల్.. అది కూడా హీరోయిన్‌తో సమ ప్రాధాన్యమున్న రోల్.. దాదాపు సెకెండ్ హీరోయిన్ అనుకోవచ్చు.. అంత ముఖ్యమైన పాత్రకు సంబంధించి దాదాపు సైన్ చేసేదాకా వెళ్ళింది వ్యవహారం.! కానీ, ఇంతలోనే బెడిసి కొట్టిందామెకి. ఆమె ఎవరో కాదు సంయుక్త మీనన్ అట.

రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఆఫర్ చేసిందట ఓ నిర్మాణ సంస్థ. ఏమయ్యిందో చివరి నిమిషంలో ‘వద్దు లే’ అనేశారట.! ‘విరూపాక్ష’ సినిమా విషయంలో సంయుక్త చేసిన అతి వల్లే ఇదంతా జరిగిందా.? అని సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. ‘నా ఫొటోతో పోస్టర్ ఎందుకు రిలీజ్ చేయలేదు.?’ అంటూ ఆమె ‘విరూపాక్ష’ చిత్ర నిర్మాణ సంస్థని ఉగాది పండగనాడు నిలదీసిన సంగతి తెలిసిందే.

ఏమో, అదీ ఓ కారణం అయి వుండొచ్చు.. కాకపోయీ వుండొచ్చు.! కానీ, సంయుక్తకి మాత్రం ఝలక్ తగిలేసింది గట్టిగానే.