ఓటిటి : సమంత మరోసారి అలాంటి సీన్స్.?

సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు కాగా సమంత అయితే రీసెంట్ గా నటించిన భారీ పాన్ ఇండియా సినిమానే “శాకుంతలం” అయితే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో వేరేగా చెప్పక్కర్లేదు. అయితే సమంత కెరీర్ పరంగా సినిమాలుతో పాటుగా వెబ్ సిరీస్ లు కూస్తో చేస్తుందన్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సిరీస్ లలో తాను మొదటగా చేసిన “ఫ్యామిలీ మాన్ 2” అయితే ఒక ఊహించని సెన్సేషన్ అని చెప్పాలి. మరి ఈ సిరీస్ లో కొన్ని షాకింగ్ సీన్స్ అయితే ఆడియెన్స్ కి కళ్ళు తెలేసేలా చేసాయి అంతే కాకుండా ఆ సిరీస్ లో ఉన్న కొన్ని అభ్యంతరకర సీన్స్ వల్లనే సమంత కి చైతు కి విడాకులు కూడా అయ్యాయని రూమర్స్ ఉన్నాయి.

అయితే మరి ఈ సిరీస్ తర్వాత మళ్ళీ అదే సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే లతో చేసిన మరో లేటెస్ట్ సిరీస్ నే “సిటాడెల్”. ఆల్రెడీ హాలీవుడ్ లో వచ్చిన ఈ సిరీస్ దానికి రీమేక్ గా అయితే ఇండియన్ వెర్షన్ లో తెరకెక్కుతుంది మరి ఈ సిరీస్ లో కూడా సమంత కొన్ని అలాంటి సన్నివేశాలు చేసింది అని పలు షాకింగ్ రూమర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి.

ఇక దీనిపై అయితే ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది. కాగా సినీ వర్గాల్లో సమాచారం ప్రకారం అయితే సమంత ఈ సిరీస్ లో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లో నటించలేదని ఆమె ఆ సీన్స్ కి నో కూడా చెప్పింది అని తెలుస్తుంది. దీనితో అయితే వెబ్ సిరీస్ ల విషయంలో మాత్రం సమంత కాస్త మంచి నిర్ణయమే తీసుకుంది అని చెప్పొచ్చు.