Gallery

Home News రవితేజ సినిమా ప్లాన్ మారిందా ..మరి వాళ్ళ పరిస్థితేంటో ..?

రవితేజ సినిమా ప్లాన్ మారిందా ..మరి వాళ్ళ పరిస్థితేంటో ..?

మాస్ మహారాజ రవితేజ రాజా ది గ్రేట్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ దక్కలేదన్న సంగతి తెలిసిందే. చేసిన సినిమాలన్ని వరసగా ఫ్లాపవుతూ వస్తున్నాయి. అందుకే ఈ సారి హిట్ తప్ప ఫ్లాప్ అన్న మాట వినకూడదని ఫిక్సైయ్యాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే రవితేజ కి రెండు మంచి కమర్షియల్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో క్రాక్ అన్న సినిమా చేస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు.

Ravi Teja And Shruti Haasan'S Krack Sankranti Poster Released | Telugu Movie  News - Times Of India

ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సుముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తుండగా థమన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ క్రమంలో రవితేజ తన నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. క్రాక్ తో పాటు ‘ఖిలాడి’ మీద రవితేజ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. కాగా ఈ సినిమాలో రవితేజ కి జంటగా డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Ravi Teja Unveils The First Look Of 'Khiladi'

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బుల్లితెర హాట్ యాంకర్ కం నటి అనసూయ నటించబోతున్నట్టు సమాచారం. క్షణం, రంగస్థలం సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ. ప్రస్తుతం క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకతంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక తాజాగా రవితేజ ‘ఖిలాడి’ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కినట్టు తెలుస్తుంది.

అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా మొదలవడానికి ఇంకా కొంత సమయం పడుతుండటంతో ‘ఖిలాడి’ కంటే ముందు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో నటించబోతున్నాడట రవితేజ. కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ రూపొందుతుంది. ఇప్పటికే ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ మంచి హిట్స్ అందుకున్నాడు.

- Advertisement -

Related Posts

కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాదైనా ఎన్టీవీ ‘కోటి దీపోత్సవం’ జరిగేనా..?

ప్రముఖ వార్తా చానెల్ ఎన్టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా వేలమంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని సంస్థకే చెందిన భక్తి చానెల్...

ఐటీ పాలసీ, EMC, డిజిటల్ లైబ్రెరీలపై సీఎం జగన్ సమీక్ష…పలు కీలక నిర్ణయాలు !

తాడేపల్లి: ఎపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్(EMC) ,గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీల ఏర్పాటుపైన అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ...

ఇప్పటిదాకా ఆసుపత్రుల దోపిడీ, ఇకపై విద్యా సంస్థల దోపిడీ.

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచేశాయ్. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల వంతు వచ్చినట్టుంది. దోపిడీ షురూ అయ్యింది. వేలల్లో లక్షల్లో ఫీజుల్ని గుంజేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు....

Latest News