NBK111: గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, #NBK111 లో హీరోయిన్ గా నయనతార

వరుస బ్లాక్‌బస్టర్‌ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కొలాబరేషన్ లో హిస్టారికల్ ఎపిక్ #NBK111 చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రస్తుతం పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా చేస్తున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

మెజెస్టిక్ & మైటీ క్వీన్స్ చాప్టర్ ప్రారంభమైయింది. ఈ హై బడ్జెట్ సినిమాటిక్ స్పెక్టికల్ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నయనతార ఈ ప్రాజెక్ట్‌లో చేరారు. ఆమె పాత్ర కథనానికి కీలకం కానుంది. సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాల్గవ చిత్రం ఇది. ఈ విజయవంతమైన జంటను మరోసారి తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది ఒక అద్భుతమైన ట్రీట్ లాంటిది. ఈరోజు నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ ఎనౌన్స్ మెంట్ చేశారు.

మేజెస్టిక్ అనౌన్స్‌మెంట్ వీడియోతో సినిమా అంబిషస్ స్కేలు, విజువల్ స్పెక్టకిల్‌ అన్నీ అద్భుతంగా చూపించారు. సినిమాకి కావాల్సిన గ్రాండ్ టోన్‌ను ఇది సెట్ చేస్తుంది.

డైరెక్టర్ గోపిచంద్ మలినేని నయనతారను గుర్రంపై పరిచయం చేసే విధానం ద్వారా ఈ ప్రాజెక్ట్‌ ఎంత భారీ స్థాయిలో రూపొందుతోందో స్పష్టమవుతోంది. ఇప్పటివరకు చూడని గ్రాండియర్‌తో విజువల్ వండర్ లా ఈ సినిమా ఉండబోతోంది.

గోపిచంద్ మలినేని తొలిసారిగా హిస్టారికల్ డ్రామాలోకి అడుగుపెడుతున్నారు. కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ రూపొందించే తన ప్రత్యేక మాస్ టచ్‌ను ఒక భారీ చారిత్రక కథలో మిళితం చేస్తూ, నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతార్ చూపించబోతున్నారు. ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్ ఫుల్ యాక్షన్, అద్భుతమైన విజువల్స్ కలిసి ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.

ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

తారాగణం: నందమూరి బాలకృష్ణ, నయనతార

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
పీఆర్వో: వంశీ-శేఖర్

బాబు మాయ | Congress Tulasi Reddy Slams Chandrababu On Vizag Steel Plant Workers | Pawan Kalyan | TR