Rashmika:పాన్ ఇండియన్ మూవీ లో ఐటం సాంగ్ చేయనున్న రష్మిక.. హీరో కోసం ఓకే చేసేనా?

Rashmika:ప్రస్తుతం హీరోయిన్ ఐటమ్ సాంగ్ ల తో అదరగొట్టే ఇస్తున్నారు. చిన్న పెద్ద హీరోయిన్ల తేడా లేకుండా అందరూ ఐటమ్ సాంగ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సమంత, కాజల్, పూజా హెగ్డే,తమన్నా ఇప్పటికే ఐటమ్ సాంగ్ లతో అదరగొట్టేసారు. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా లోని ఐటమ్ సాంగ్ తో సమంత కు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ ఐటమ్ సాంగ్ ల లిస్ట్ లోకి చేరుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

‘అర్జున్‌ రెడ్డి ‘ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘యానిమల్‌’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రణబీర్‌ కపూర్‌ కథానాయకుడు. పరిణితీ చోప్రా కథానాయిక.  ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంటుందట.ఆ పాట కోసం రష్మిక పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే రష్మిక తో సంప్రదింపులు కూడా జరపబోతున్నారుఅట.

‘యానిమల్’ ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో ఒక చిన్న పాత్ర అయినా వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అందులోనూ రన్ బీర్ కపూర్, బాలీవుడ్ ప్రాజెక్ట్ కాబట్టి రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఐటెం సాంగ్ కు రష్మిక పచ్చజెండా ఉపుతుందో లేదో వేచి చూడాలి.