ఎవరైనా సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఎవరితో తిరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలాంటి చీకటి వ్యవహారాలు నడిపినా ఎవడూ పట్టించుకునే వాళ్ళు, పబ్లిసిటీ చేసే వాళ్ళుండరు. అదే కాస్త పేరున్న వ్యక్తులైతే సీన్ వేరేలా ఉంటుంది. ఇక సినిమా సెలబ్రిటీస్ అయితే ప్రతీ ఒక్కరిలో అమితమైన ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీని పట్టి పీడిస్తుంది డ్రగ్స్ మాఫియా. ఇందులో ఎంతో మంది సినీ తారలు ఇరుక్కుంటున్నారు. ఈ వ్యసనానికి బానిసలై కొన్నేళ్ళుగా సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠ లు సర్వ నాశనం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో తీగ లాగితే పెద్ద డొంకే కదిలింది. ఆ డొంకలో పెద్ద పెద్ద వాళ్ళే బయటికి వస్తున్నారు. సుషాంత్ మృతి కాస్త డ్రగ్స్ వ్యవహారం గా మారింది. రియా ఎన్సీబి అధికారులకి చెప్పిన 25 మందిలో దాదాపు అందరు సినిమా వాళ్ళే ఉన్నారని తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొణె, శ్రద్ద కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకి వచ్చి విచారణ జరుగుతోంది.
అయితే రకుల్ ఇందులో అనవసరంగా ఇరుక్కుందని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ తీసుకోకపోయినా వాటిని తన వద్ద బద్రపరచిందని, అవి ఎవరో వచ్చి కలెక్ట్ చేసున్నారని విచారణలో రకుల్ ఎన్సిబీ అధికారులకి తెలిపినట్టు సమాచారం. అయితే తను మాత్రం డ్రగ్స్ ఎప్పుడు అలవాటు చేసుకోలెదని తెలిపిందట. ఏదేమైనా రియా తో స్నేహం చేసి తనతో ఖరీదైన కార్ల లో షికార్లు చేయడం పార్టీలల్లో కలిసి జల్సా చేయడం వలనే రకుల్ కెరీర్ కి ఈ రోజు ప్రమాదం వాటిల్లిందని ఇది తన సినిమా కెరీర్ మీద తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశాలున్నాయని అంటున్నారు.