వైరల్ : ఇప్పుడు రివెంజ్ తీర్చుకున్న రజినీకాంత్?

ఇప్పుడు తమిళ సినిమా నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ రిలీజ్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం “జైలర్” అనే చెప్పాలి. కాగా ఈ చిత్రంతో రజినీకాంత్ మళ్ళీ తన రేంజ్ కం బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడని ఫ్యాన్స్ చూస్తుండగా రజిని గత రెండు మూడు సినిమాలు కన్నా బెటర్ గా మన తెలుగులో కూడా ఈ సినిమాకి హైప్ సహా బుకింగ్స్ కనిపిస్తున్నాయి.

అయితే లేటెస్ట్ గా రజినీకాంత్ నుంచి కొన్ని మాటలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారాయి. జైలర్ కి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల తమిళ నాడులో జరిగింది. కాగా ఈ మాసివ్ ఈవెంట్ లో రజినీకాంత్ చెప్పిన డైలాగ్స్ కొన్ని అలాగే తన స్పీచ్ ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా వైరల్ గా మారిపోయింది.

అయితే ఈ డైలాగ్స్ ఖచ్చితంగా రజిని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కొందరు మంత్రులని టార్గెట్ చేసి అన్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. మొరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు ఈ రెండు లేని ఊరు లేదు అందుకే నీ పని నువ్ చేసుకుంటూ వెళ్ళిపో..

అనే డైలాగ్ ఖచ్చితంగా తనని అప్పుడు టార్గెట్ చేసి విమర్శించినా ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులని టార్గెట్ చేసి ఇప్పుడు చెప్పిందే అని చాలా మంది అంటున్నారు. దీనితో రజిని ఆ రివెంజ్ ని ఇప్పుడు ఇలా తీర్చుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పుడు రజిని స్పీచ్ ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది.