Radhe Shyam:రాధే శ్యామ్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినిమా అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. టి -సిరీస్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణం రాజు, భాగ్యశ్రీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ను మార్చి 11 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధం చేస్తున్నారు. సినిమా విడుదలకు రెండు రోజుల సమయం, బొమ్మ పడిపోతుంది. ఇక రెండు రోజులు ఎదురు చూస్తే సినిమా జాతకం తెలిసిపోతుంది. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి సినిమా మీద ఉన్న అంచనాలు ఒక ఎత్తయితే, విడుదలకు ముందు ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇటాలియన్ కల్చర్ లో ఒక ఇండియన్ సినిమాని తీయడం ఇదే మొదటిసారి, దీన్ని చూడటం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఒక ప్రేమకథను మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సెట్స్ దే ప్రధాన పాత్ర. ఈ సినిమా కోసం ఏకంగా 101 సెట్స్ ను వేశారట. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ పనితనం ఈ సినిమాకు చాలా ఉపయోగపడిందని ప్రశంసలు కూడా అందుకున్నారు.ఈ సినిమా కోసం నాలుగు ట్రైన్ సెట్స్ వేశారు రవీందర్. ఓ భారీ షిప్ సెటప్ కూడా ఉంది.ఇటలీ కట్టడాల్ని పోలిన నిర్మాణాలు హైదరాబాద్‌లో సెట్స్ రూపంలో తీర్చిదిద్దారు
ఈ సినిమా ఇటీవల కొంతమంది ప్రముఖులు చూశారు. వాళ్లంతా సెట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారట.ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమా చూసి `ఆర్ట్ విభాగం పనితనం చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమాకి ఆర్ట్ లో నేషనల్ అవార్డు వస్తుందనిపిస్తోంద`ని కాంప్లిమెంట్ ఇచ్చారని తెలుస్తోంది.బాహుబలి సినిమా కోసం కూడా ఇన్ని సెట్లు వేయలేదట.సాధారణంగా షిప్ అనగానే.. పైకి కనిపించే సెటప్ ఒకటి సెట్ చేస్తే చాలు. కానీ.. దాని మెకానిజం, ఇంజన్ కూడా సృష్టించడం… ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో క్లైమాక్స్ అంతా షిప్ లోనే చిత్రీకరించారట,ఇలాంటి క్లైమాక్స్ ఇండియన్ సినిమాలోని మొదటిసారి తీశారట. ఇంత పనితనం ఉన్న సినిమాకి రాజమౌళి చెప్పిన మాటలు నిజమే అయి ఆప్ లో నేషనల్ అవార్డు వస్తే ఆనందమే మరి.