ఏదీ తెలియకుండా అవార్డుల ఫంక్షన్లకు వెళతారా.? ఛాన్సే లేదు. మంచి యాక్టింగే చేశాడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీయార్. కాదు కాదు, చాలా బాగా నటించాడు. నటుడిగా సైమా అవార్డుకి జూనియర్ ఎన్టీయార్ అర్హుడే.
కానీ, నటి శ్రీలీలకు ఎలా ఉత్తమ నటి అవార్డుని ‘ధమాకా’ సినిమాకి ఇచ్చారబ్బా.? శ్రీలీలకు అవార్డు ఇచ్చారంటే, తాను తీసుకునే అవార్డులో అర్థం లేదని ఎన్టీయార్ గ్రహించే వుంటాడు. కానీ, తప్పదు. పిలిచారు, తప్పదని వెళ్లాడు.
ఆ వేదికపై జూనియర్ ఎన్టీయార్ ఎమోషనల్‌గా ఫీలయ్యాడు. తన ఆనందంలోనూ, తన కష్టంలోనూ అభిమానులు తనతోనే వున్నారంటూ జూనియర్ ఎన్టీయార్ చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో అవన్నీ అవసరమా.? అంటే, అవసరమేనేమో.!
చంద్రబాబు అరెస్టయి జైలుకు వెళ్ళారు. ఆయనెవరో కాదు, జూనియర్ ఎన్టీయార్‌కి మేనత్త భువనేశ్వరి భర్తే.! సో, రాజకీయాలతో సంబంధం లేకుండా, మావయ్య చంద్రబాబుని జైల్లో పరామర్శించి వుండాలి జూనియర్ ఎన్టీయార్.
లేదంటే, భువనేశ్వరిని కలిసి సంఘీభావం ప్రకటించినా పోయేది. కానీ, జూనియర్ ఎన్టీయార్ ఇవేవీ చేయలేదు. కావాలనే చేయలేదా.? కళ్యాణ్ రామ్ కూడా వెళ్ళకపోవడానికి కారణమేంటి.?
చంద్రబాబు కోసం వెళ్ళలేదుగానీ, అవార్డు కోసం విదేశాలకు వెళ్ళిపోయాడంటూ ర్యాగింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ వైపు శ్రీలీల ఉత్తమ నటి, ఇంకో వైపు టీడీపీ ర్యాగింగ్.. వెరసి, అవార్డు వచ్చిందన్న ఆనందం ఎన్టీయార్‌కి లేకుండా పోయింది.