మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ ప్లాన్ చేసుకున్న సినిమాల లైనప్ బాగానే ఉంది కాని వాటిలో ఎక్కువగా ప్రయోగాత్మకమైన కథ లే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఓటీటీలో వచ్చిన పెంగ్విన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో నేను శైలజ సినిమా తో హీరోయిన్ గా పరిచయమయిన కీర్తి సురేష్ మంచి సక్సస్ ని అందుకుంది. తర్వాత నాని నటించిన నేనులోకల్ సినిమా కూడా కీర్తి కి మంచి పేరే తెచ్చిపెట్టింది.
అయితే భారీ అంచనాలు పెట్టుకొని నటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. కాని మహానటి సినిమా రేంజ్ ని ఎవరూ ఊహించని విధంగా మార్చేసింది. ఈ సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ తో తెలుగుతో పాటు తమిళం లోను వరుసగా అవకాశాలు అందుకుంటుంది కీర్తి. కాగా కీర్తి సురేష్ నటిస్తున్న మరో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల మీద కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.
వీటిలో మిస్ ఇండియా త్వరలో రిలీజ్ కానుందని అంటున్నారు. ఈ సినిమాని కూడా ప్రముఖ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ ఎస్ కోనేరు నిర్మాతగా నరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్ ఇండియా సినిమా ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కాని ఈ సినిమాకి ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా చిన్న పాయింట్ అని ఇంత చిన్న పాయింట్ తో సినిమా సక్సస్ సాధించగలుగుతుందా అన్న సందేహాలు కొందరిలో కలుగుతున్నాయట.
ఈ సినిమాలో కీర్తి సురేష్ మన భారతీయ సంప్రదాయ పానీయం అయిన టీ ని విదేశాలకు తీసుకువెళ్లి అక్కడ పెద్ద వ్యాపారంగా మలిచి విజయం సాధించడమే మేయిన్ థీం అని టీజర్ లో చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇదే ఇప్పుడు కొందరికి సందేహంగా ఉందంటున్నారు. మరి మంచి స్క్రీన్ ప్లే గనక ఉంటే భారీ సక్సస్ అయినా ఆశ్చర్య పోనవసరం లేదన్న మాట కూడా వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.