Ram Pothineni:రామ్,బోయపాటి శ్రీను సినిమాకు హీరోయిన్ జాన్వీ కపూర్..?

Ram Pothineni:ఎనర్జిటిక్ హీరో రామ్ తన నెక్స్ట్ మూవీ ని బోయపాటి డైరెక్షన్ లో తీయనున్నాడని ప్రకటించాక ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగాయి. అఖండ మాస్ సక్సెస్ తర్వాత బోయపాటి తన తదుపరి చిత్రంగా రామ్ తో ఒక యాక్షన్ ప్యాక్ సినిమా తీయబోతున్నాడు.ఈ సినిమా ను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. దీనికోసం శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తున్నారట. దీని గురించి జాన్వికపూర్ తో చర్చలు కూడా జరిపారని ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని ఇన్సైడ్ టాక్. హీరోయిన్ గా ఇక పూరి సినిమాకి దాదాపుగా ఖరారైందని,త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే కాకుండా ఈ సినిమా కు సంబంధించి ఇంకొక వార్త కూడా చక్కెర్లు కొడుతోంది.తెలుగులో ఎన్నో చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఒకప్పటి సీనియర్ నటి శోభన తిరిగి ఈ సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు సమాచారం.ఈ సినిమాలో రామ్ కి అమ్మ పాత్రలో శోభన నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ మలయాళ చిత్రంలో నటిస్తోంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో బోయపాటి, రామ్ కాంబో సినిమాలో మోడ్రన్ మదర్ గా అలరించడానికి సిద్ధమయ్యిందట.

రామ్ ప్రస్తుతం లింగస్వామి డైరెక్షన్ లో ద్విభాషా చిత్రం లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు లో ఒకేసారి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ కీర్తి శెట్టి.ఈ సినిమా తర్వాత రామ్ బోయపాటి కాంబో సినిమా ప్రారంభిస్తారు. స్క్రిప్ట్ వర్క్ పని లో బోయపాటి బిజీ గా ఉన్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం ఫ్యాన్స్ అంచనాలు బాగానే పెట్టుకున్నారు.