మాళవిక శర్మ టాలీవుడ్ లో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. మాస్ మహారాజ రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. ఈ సినిమా పోస్టర్స్.. ప్రమోషన్స్ లో మాళవిక ని చూసిన ప్రతీ ఒక్కరు ఇండస్ట్రీలో చాలాకాలం సక్సస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుందని భావించారు. అంతేకాదు మాళవిక లాంటి అమ్మాయి యంగ్ హీరోలకి పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని మాట్లాడుకున్నారు. ఓ పదేళ్ళ పాటు టాలీవుడ్ లో గట్టి పోటీ ఇస్తుందని డిసైడయ్యారు.
కాని నేల టికెట్ రిలీజ్ అయ్యాక మళ్ళీ ఈ బ్యూటీ గురించి నోరు విప్పిన వాళ్ళు లేరు. సినిమా డిజాస్టర్ కావడం ఒక కారణం అయితే ఈ కుర్ర బ్యూటీ రవితేజ లాంటి సీనియర్ హీరో పక్కన ఎంట్రీ ఇవ్వడం ఒక మైనస్ అని కామెంట్స్ చేశారు. యూత్ ని బాగా అట్రాక్ట్ చేసినప్పటికి పర్‌ఫార్మెన్స్ .. డాన్స్ లో హుషారుగా ఉన్నప్పటికి అద్భుతమైన కెరీర్ ని ఊహించుకున్న మాళవిక కి మాత్రం ఈ సినిమా ఎంట్రీకి కరెక్ట్ కాదని నెమ్మదిగా అర్థమైంది.
ఈ సినిమా తర్వాత ఎంతగానో అవకాశాల కోసం ఎదురు చూసిందట. కాని పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు. కాని ఎనర్జిటిక్ హీరో రాం ఇస్మార్ట్ శంకర్ తో ఫాం లోకి వచ్చి మరోసారి మాస్ కంటెంట్ ఉన్న సినిమాలో నటించాడు. ఆ సినిమానే తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన తడం కి రీమేక్ రెడ్. ఈ సినిమాలో ఊహించని విధంగా మాళవిక కి అవకాశం రావడం గొప్ప విషయం. మరి ఈ సినిమా గనక సక్సస్ అయితే ఈ కుర్ర భామ వరసగా అవకాశాలు అందుకుంటుంది. లేదంటే ఇక అంతే. అన్నట్టు మరోసారి రవితేజ తో జత కట్ట బోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరి ఇది ఎంతవరకు నిజమో అధికారకంగా ప్రకటన వస్తే గాని క్లారిటీ రాదు.