నితిన్ కాపీ కొట్టేస్తున్నాడా.?

యంగ్ హీరో నితిన్‌కి ‘మాచర్ల నియోజక వర్గం’ పెద్ద షాకే ఇచ్చిందని చెప్పాలి. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అడ్రస్ లేకుండా పోయింది. ఇంతవరకూ ఓటీటీలో ప్రసారం కావడానికి కూడా నోచుకోలేదీ సినిమా. ఈ టైమ్‌లో నితిన్ రూటు మార్చేశాడనీ తెలుస్తోంది. తన కొత్త సినిమా కోసం ‘పుష్ప’ లా మారిపోతున్నాడట నితిన్. అదేనండీ, ‘పుష్ప’ సినిమా మాదిరి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడట. గెటప్ కూడా కాస్త అటూ ఇటూగా అలాగే వుండబోతోందనీ తెలుస్తోంది.

‘పుష్ప’ సినిమాను షూట్ చేసిన అదే అడవుల్లో ఈ సినిమా షూట్ ప్లాన్ చేస్తున్నాడట. కొన్ని మాస్ సీన్లను మక్కీకి మక్కీ లేపేయాలని తన టెక్నీషియన్లకు సూచిస్తున్నాడట నితిన్. అలాగే, ‘రంగస్థలం’ సినిమాలోని కొన్ని సీన్లను సైతం తన సినిమా కోసం కాపీ చేసేస్తున్నాడనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

అటు ‘రంగస్థలం’, ఇటు ‘పుష్ప’ సినిమాలు సూపర్ డూపర్ హిట్ సినిమాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో, నితిన్ కన్ను ఆ రెండు సినిమాలపై పడిందన్న మాట. ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో కాపీ రూటులో పడ్డాడన్న మాట నితిన్. నితిన్ ప్లాన్ బాగానే వుంది కానీ, అలా కాపీ కొట్టిన సినిమాలని ఈ మధ్య ఎలా తిప్పి కొడుతున్నారో ప్రేక్షకులు.. ఆ లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడబ్బా నితిన్.!