ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వచ్చిన మొదటి సెన్సేషనల్ రిలీజ్ ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం ఖచ్చితంగా “హనుమాన్” అని చెప్పాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. చిన్న హీరో తేజ సజ్జ కొత్త దర్శకుడు కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉన్నవాడు అని ప్రశాంత్ వర్మ లని తొక్కాలని చాలా మంది చూసారు కానీ వారి వెనుక ఉన్న మహా శక్తి హనుమాన్ బలం ముందు అవన్నీ తగ్గిపోవాల్సి వచ్చింది.
ఇక నిన్న సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల్లో హనుమన్ ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీనితో హనుమాన్ సినిమా ఏంటి అనేది అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. కాగా ఈ సినిమా చేస్తున్నప్పుడే ప్రశాంత్ వర్మ తాను ఓ భట్ సిరీస్ లా అంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగ మన ఇండియన్ ఇతిహాసాల నుంచి ప్రేరణ చెంది మన సూపర్ హీరో సినిమాలు చేస్తాను అని అందులో మొదటిదే ఈ హనుమాన్ అని చెప్పాడు.
ఇక సీన్ కట్ చేస్తే హనుమాన్ సినిమా ఒక ప్రభంజనంలా మారిపోయింది. మెయిన్ గా ఆ క్లైమాక్స్ బిట్ మొత్తం ఆడియెన్స్ ని ఓ రేంజ్ లో ట్రాన్స్ లోకి తీసుకెళ్తే ఈ సినిమా ఎండింగ్ లో సినిమాకి పార్ట్ 2(జై హనుమాన్) కూడా ఉన్నట్టుగా ప్రశాంత్ వర్మ తెలిపాడు. దీనితో ఈ భారీ చిత్రమ్ ఎప్పుడు వస్తుందా అనేది అత్యంత ఆసక్తిగా మారింది.
కాగా తాను ఈ సినిమాని 2025లో రిలీజ్ చేస్తున్నట్టుగా సంవత్సరం కూడా యాడ్ చేసేసాడు. కానీ ఈ ఏడాది గ్యాప్ లో సినిమా వస్తుందా లేదా అనేది ప్రశ్న. పార్ట్ 1 నే కొన్ని వాయిదాలు తర్వాత రిలీజ్ చేశారు. దీనితో హనుమాన్ 2 ఎప్పుడు వస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆల్రెడీ కొంచెం షూటింగ్ కంప్లీట్ అయ్యిందా లేక ఇంకా అవ్వాల్సి ఉందా అనేవి తెలియరావాలి.