పబ్లిసిటీ లేకుండా పని కానిచ్చేస్తున్న గోవా బూటీ..?

ఒకప్పుడు ఇలియానా అంటే టాలీవుడ్ లో ప్రతీఒక్కరికి మహా క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలకి, దర్శకుల కి ఇలియానా డేట్స్ దొరకడం కష్టంగా మారింది. కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే కూడా నిర్మాతలు కళ్ళు మూసుకొని ఇలియానా చేతిలో ఆఫర్ పెట్టేవారు. టాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ చేసిన ఇలియానా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అయితే గత కొంతకాలంగా ఇలియానా టాలీవుడ్ లో అవకాశాలకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Happy Birthday Ileana D'Cruz: The lovely Lady's Stylish Look In Amar Akbar  Antony Is Awesome - Filmibeat

ఆ మధ్యలో మాస్ మహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సస్ సాధించి మళ్ళీ వరసగా టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుందని భావించింది. కాని ఈ సినిమా ఇలియానా అంచనాలని తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే అడపా దడపా బాలీవుడ్ లో అప్పుడప్పుడు ఒక సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. రెండేళ్ళ క్రితం బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన రైడ్ అన్న సినిమా చేసి హిట్ అందుకుంది.

ఆ తర్వాత అజయ్ దేవగన్ సిఫార్సుతో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న బిగ్ బుల్ అన్న సినిమాలో అవకాశం ఇప్పించాడని అన్నారు. ప్రస్తుతం ఈ ఒక్క సినిమానే ఇలియానా చేస్తుందనుకున్నా అందరికి స్వీట్ షాకిచ్చింది ఇలియానా. ఈ సినిమా కాకుండా బాలీవుడ్ లో రణదీప్ హుడా కి జంటగా ‘అన్ ఫెయిర్ అండ్ లవ్ లీ’ అన్న సినిమాని సైలెంట్ గా కంప్లీట్ చేసేసిందట. ఈ సినిమాకి ముబారకన్ కథా రచయిత బల్విందర్ సింగ్ జంజున దర్శకత్వం వహించాడు. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండటం విశేషం.