ఓటిటి : ఫైనల్ గా “కాంతారా” డిజిటల్ రిలీజ్ డేట్ వచ్చేసిందా??

ఈ ఏడాది పాన్ ఇండియా సినిమాలో భారీ హిట్స్ అయ్యినటువంటి చిత్రాల్లో కన్నడ నుంచి వచ్చిన చిత్రాలు కూడా ఒకటి. మరి మొదటగా భారీ హైప్ తో వచ్చిన చిత్రం కేజీఎఫ్ 2 హిందీ మార్కెట్ ని దున్నేయ్యగా నెక్స్ట్ ఇపుడు కాంతారా అనే సినిమా ఓ పెను సంచలనంగా మారింది.

హిందీ తెలుగు కన్నడ భాషల్లో భారీ వసూళ్లతో ఏకంగా 350 కోట్ల గ్రాస్ కి పైగా ఈ చిత్రం కొల్లగొట్టి ఈ ఏడాది భారీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అలాగే కన్నడ లో అయితే కేజీఎఫ్ 2 కన్నా ఎక్కువ ఫుట్ ఫాల్స్ ని సొంతం చేసుకొని రికార్డులు నెలకొల్పింది.

ఇక థియేటర్లు లో ఎన్నో వండర్స్ చేసిన ఈ చిత్రం ఎప్పుడు ఓటిటి లో వస్తుందా అని అంతా ఆసక్తిగా చూసే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి ఫైనల్ గా అయితే వాళ్ళకి ఇప్పుడు ఓ ఫైనల్ డేట్ కన్ఫర్మ్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి సినీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే మేకర్స్ ఈ సినిమాని ఈ నవంబర్ 24 నుంచి డిజిటల్ గా అందుబాటులోకి తీసుకురావడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే ఈ చిత్రం స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వారు తీసుకోగా దీనిలో ఈ నవంబర్ 24 నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ కి అన్ని భాషల్లో రానుంది. మరి ఈ సూపర్ హిట్ సినిమాని రిషబ్ శెట్టి దర్సకత్వం వహించగా తానే రచించి దర్శకత్వం కూడా వహించాడు.