ప్రభాస్ మీద అల్లు అర్జున్‌కి అక్కసు ఎందుకు.?

కొద్ది రోజుల క్రితం ప్రభాస్ ఫేక్ ఫొటోని వైరల్ చేశారు కొందరు నెటిజన్లు. కాదు కాదు, అల్లు అర్జున్ అభిమానులే ఆ పని చేశారు. ఏమయ్యింది.? ఎందుకిలా జరిగింది.? ఎవరి ప్రోద్భలంతో ఈ కథ మొత్తం నడిచింది.?

ప్రభాస్ అభిమానులు ఆరా తీస్తే, ఇదంతా అల్లు అర్జున్ పీఆర్ టీమ్ పనేనని తేలిందట. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. ‘అబ్బే, అదేం లేదు..’ అంటూ అల్లు అర్జున్ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు.

కానీ, డ్యామేజీ అయితే గట్టిగా జరిగిపోయింది. అల్లు అర్జున్ అభిమానులు ఇలా వ్యవహరించడం ఇదే కొత్త కాదు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్, మహేష్.. ఇలా అందరు హీరోలపైనా అల్లు అర్జున్ ఆర్మీ ‘ఛండాలం’ ప్రదర్శిస్తూనే వుంది.

‘నాకున్నది అభిమానులు కాదు, ఆర్మీ..’ అని అల్లు అర్జున్ చెప్పుకుంటున్నాడుగానీ, ఆ ఆర్మీ చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇదేదో ప్రభాస్ మీద అల్లు అర్జున్‌కే అక్కసు.. అన్నట్టుగా తయారైంది.