నాగార్జున వారసుడిగా అఖిల్ వెండితెర మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. మనం సినిమాలో చిన్న క్యారెక్ట లో కనిపించిన అఖిల్ అందరినీ ఆశ్చర్యపరచాడు. హాలీవుడ్ సినిమా రేంజ్ లో స్టంట్స్ చేసి అబ్బా .. అనిపించాడు. దాంతో అందరు అఖిల్ ని హీరో చేయమని నాగార్జున కి సలహా ఇచ్చారు. దాంతో నాగార్జున యాక్టింగ్ లో మెచ్యూరిటీ రాకుండానే అఖిల్ ని హీరో చేశాడు. నితిన్ నిర్మాతగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ” అఖిల్ ” అన్న సినిమాతో హీరోగా టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు.
ఫస్ట్ సినిమానే భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ఞు సినిమాలు కూడా ఫ్లాప్ గానే మిగిలాయి. ఈ మూడు సినిమాలకి ప్రేక్షకుల నుంచి ఒకటే కంప్లైంట్. అఖిల్ ఇంకా యాక్టింగ్ లో మెరుగవ్వాలని. అదీ కాక అఖిల్ సినిమాలో హీరోయిన్స్ సరిగ్గా సెట్ అవడం లేదని. ఏదేమైనా అఖిల్ ని హీరోగా నిలబెట్టాలని నాగార్జున ఎంతో తాపత్రయపడుతున్నాడు. ఈ క్రమంలోనే నాలుగో ప్రయత్నంగా గీతా ఆర్ట్స్ 2 లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వాస్తవంగా ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. అఖిల్ కూడా ఈ విషయాన్ని వెల్లడించాడు. తీరా చూస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే ఇందుకు కారణం ఈ సినిమా రష్ చూసిన నాగార్జున సెకండాఫ్ లో కొన్ని సీన్స్ నచ్చక రీ షూట్ చేయమని మేకర్స్ కి సలహా ఇవ్వడమే అని అంటున్నారు. ఇప్పటికే వరసగా మూడు సినిమాలు ఫ్లాపయ్యాయి కాబట్టి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్ అవ్వాలన్నదే నాగార్జున పట్టుదల అని చెప్పుకుంటున్నారు. అందుకే కాస్త బడ్జెట్ పెరిగినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రీ షూట్ చేస్తున్నారట. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుందో చూడాలి.