ఐపీఎల్ 2025 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న తరుణంలో గుజరాత్ టైటాన్స్ విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ఢిల్లీపై 10 వికెట్ల తేడాతో గెలిచి టైటాన్స్ ప్లేఆఫ్స్ బెర్తును కైవసం చేసుకుంది. ఇదే మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమితో బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కూడా నాకౌట్ రేసులోకి ప్రవేశించాయి. ఇప్పుడు టాప్-2లో నిలవడానికి మూడు జట్లు కసరత్తు మొదలుపెట్టగా, ముంబయి, ఢిల్లీ, లక్నో లాంటి జట్లు ఇంకా అవకాశాల కోసం గణితాలపై ఆశలు పెంచుకున్నాయి.
గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే 18 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచుల్లో విజయాలు సాధిస్తే 22 పాయింట్లకు చేరుకునే వీలుంది. ఒక మ్యాచ్ కూడా గెలిచినా వారు టాప్-2లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు, బెంగళూరు జట్టు ప్రస్తుతం 17 పాయింట్లతో ఉంది. రెండు మ్యాచుల్లో గెలిస్తే గరిష్ఠంగా 21 పాయింట్లు సాధించగలదు. గుజరాత్ ఓటమితో బెంగళూరుకు టాప్ స్థానాల్లో నిలిచే అవకాశం ఉంటుంది.
పంజాబ్ కింగ్స్ కూడా 16 పాయింట్లతో ఉన్నది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే 20 పాయింట్లు సాధించి టాప్-2లో నిలవగలదు. అయితే, ఇది ఇతర జట్ల విజయాలపై ఆధారపడి ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈసారి పంజాబ్ మెరుగైన ప్రదర్శన కనబరచుతోంది. ముంబయి ఇండియన్స్ ప్రస్తుతం 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 18 పాయింట్లకు చేరుతుంది.
ఒకవేళ ఇతర జట్ల ఓటములు జరిగితే, నెట్ రన్‌రేట్ ఆధారంగా టాప్-4లో నిలిచే అవకాశాలున్నాయి. దిల్లీతో జరిగే కీలక మ్యాచ్‌లో గెలుపే వారి మార్గాన్ని సులభతరం చేస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. ప్రస్తుతం 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న ఈ జట్టు మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తేనే 17 పాయింట్లు సాధించి ఆశ పెంచుకోగలదు. అదే సమయంలో ముంబయి, పంజాబ్ ఓడిపోవాలి. లక్నో అయితే కేవలం ఇతర టీమ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.. మూడు మ్యాచ్‌లు గెలిచి, ఇతర జట్ల పరాభవాలకే తుదిజవాబు ఇవ్వాల్సిన పరిస్థితి.