‘దేవర’ని రెండు ముక్కలు చేస్తారా.?

ఎన్టీయార్ – కొరటాల కాంబినేషన్ మూవీ ‘దేవర’కి సంబంధించి ఓ ఆసక్తికరమైన గాసిప్ చక్కర్లు కొడుతోంది. అదే ‘దేవర’ రెండు పార్టులుగా రిలీజ్ కాబోతోందని. కథ డెప్త్ విషయంలో రెండు పార్టులయితే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారట. ఎన్టీయార్ కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలన్నింటినీ రెండు పార్టులుగా రిలీజ్ చేస్తూ, డబుల్ డోస్‌లో వసూళ్లు కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్లు. అయితే, ఆ ప్రయత్నాలు ఎంత మేర వర్కవుట్ అయ్యాయనే విషయం పక్కన పెడితే, ‘దేవర’ కథకు ఆ అవసరం వుందని మాట్లాడుకుంటున్నారట.

ఎన్టీయార్ కూడా అందుకు సుముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందనేది తెలీదు కానీ, ‘దేవర’ సినిమాని చాలా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడు ఎన్టీయార్. దగ్గరుండి అన్ని విషయాలనూ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఎక్కడా తేడా జరగక్కుండా జాగ్రత్తలు పడుతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’‌తో వచ్చిన ఇమేజ్‌ని నిలబెట్టుకోవడానికే ఎన్టీయార్ ఈ పాట్లన్నీ.!