గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళ హిట్ చిత్రం వినోదయ సీతం కి రీమేక్ గా ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకునిగా ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు.
మరి పవన్ పోర్షన్ ని అయితే తానూ కంప్లీట్ చేయగా చిన్న చిన్న షూటింగ్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ జూలై లో సినిమా సిద్ధంగా ఉండగా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు కొన్ని ఈ సినిమాపై వైరల్ గా మారుతున్నాయి.
ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ మార్కండేయుని తరహాలో కనిపిస్తాడని అలాగే అతన్ని కాలంలో పవన్ కళ్యాణ్(దేవుని) పాత్ర కలిస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది అని అలాగే ఇదే ఇద్దరు పాత్రలకిలింకప్ తో అయితే సినిమా టైటిల్ కూడా ఉండొచ్చని స్ట్రాంగ్ బజ్ తెలుస్తుంది.
అంతే కాకుండా ఈ టైటిల్ అయితే ఈ నెక్స్ట్ వీక్ లోనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా మరిన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి నిర్మాతలు దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా “విరూపాక్ష” తో భారీ హిట్ అందుకోగా నెక్స్ట్ ఈ సినిమాతో మరో హిట్ కొడుతున్నామని తెలిపాడు.