Roja – Suma: జబర్దస్త్ షోలో సుమ రోజాల మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్ ఫైట్.. రోజా కంటే సుమ 15 ఏళ్లు పెద్దదా..?

Roja – Suma: టాలీవుడ్ టాప్ మోస్ట్ లేడీ యంకర్లలో సుమ మొదటి వరుసలో ఉంటుంది. సుమ ఎప్పుడు టీవీ షోలు , ప్రీ రిలీజ్ ఈవెంట్ లు అంటూ నిత్యం బిజీగా ఉంటుంది. సుమ డేట్స్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు అంటే ఈవిడ ఎంత బిజీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. యాంకరింగ్ మాత్రమే కాకుండా ఇటీవల సుమ జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో సందడి చేసింది.

సుమా రాకతో కమెడియన్స్ అందరూ సుమనీ ఇమిటేట్ చేస్తూ స్కిట్ వేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలో తాగుబోతు రమేష్ సుమను ఇమిటేట్ చేస్తూ అవిడ ఇంట్లో భర్తతో ఎలా ఉంటుందో,బయట ఎంత బిజీగా ఉంటుందో తన స్కిట్ ద్వారా అందరికీ తెలియచేశాడు. తాగుబోతు రమేష్ వేసిన స్కిట్ అందరిలో నవ్వులు పోయించింది. స్కిట్ అయిపోయిన తర్వాత రోజా జడ్జిమెంట్ ఇస్తూ సుమ గారి గెటప్ లో తాగుబోతు రమేష్ బాగా నటించాడని కామెంట్ ఇస్తుంది. దీంతో సుమ మాట్లాడుతూ మీరేంటండి నన్ను సుమ గారు అని అంటున్నారు నేను మీ కన్నా 15 సంవత్సరాలు చిన్నదాన్ని అని సింగర్ మనో గారి వెనకాల మొహం దాచుకుంటుంది.

అందుకు రోజా మాట్లాడుతూ ‘ఎప్పుడొచ్చింది ఈవిడ నేను హీరోయిన్ గా చేసేటప్పుడు హీరోయిన్ గా వచ్చింది’ అని సుమ మీద సెటైర్లు వేసింది. కొంచెం గ్యాప్ ఇస్తే ఏకంగా 15 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది అంటూ రోజా సుమ మీద సెటైర్లు వేసింది. దీంతో సుమా సైలెంట్ గా ఉండిపోయింది. అప్పుడు రోజా ‘ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం ఇద్దరం సేమ్ టు సేమ్’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం సుమ విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకత్వంలో వస్తున్న జయమ్మ పంచాయతీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 22 వ తేదీ విడుదల చేయటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు. యాంకర్ గా అందరినీ అలరించిన సుమ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి మరి.